'సాహో' కోసం స్పెషల్ సెట్

  • IndiaGlitz, [Tuesday,February 27 2018]

ప్ర‌భాస్ హీరోగా యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. చిత్రంలో శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్, చంకీపాండే, జాకీష్రాఫ్‌, మందిరాబేడీలు విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. దుబాయ్‌లో ఓ భారీ యాక్ష‌న్ సీన్‌ను ప్లాన్ చేసింది యూనిట్ అయితే అక్క‌డి ప్ర‌భుత్వం అంగీక‌రించ‌క‌పోవ‌డంతో యూనిట్ వ‌ర్గాలు ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో దుబాయ్‌లోని రోడ్స్ సెట్స్‌ను వేసి యాక్ష‌న్ పార్ట్ పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌.