close
Choose your channels

అల వైకుంఠపురానికి రెండేళ్లు : ఒక్క హిట్టు.. ‘‘పూజా’’ని స్టార్ హీరోయిన్‌ని చేసింది

Thursday, January 13, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొన్ని సినిమాలు కొందరి కోసమే పుడతాయి. అవి కూడా చరిత్రను తిరగరాసేవిగానో, ఎదుగుబొదుగు లేని జీవితానికి మంచి బూస్ట్ ఇచ్చేలాంటివో అవుతాయి. ఆ కోవకే చెందుతుంది ‘అల వైకుంఠపురం’ . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2020 సంక్రాంతి హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల పంట పండించింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా నివేదా పేతురాజ్, సుశాంత్, జయ రామ్, టబు, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ కు, త్రివిక్రమ్ కు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

‘‘అల వైకుంఠపురం’’ సినిమాలో నటించిన వారంతా తర్వాతి మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాను ఈ మూవీ పెంచి ఆయనకు కొత్త మార్కెట్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్‌ను అందించింది. తమన్ అందించిన సంగీతం తెలుగు లొగిళ్లను , ముఖ్యంగా కుర్రకారును హుషారెత్తించింది. ఈ చిత్రంలోని పాటలు నేటికీ కొత్త అనుభూతిని అందిస్తుంది. ‘‘బుట్ట బొమ్మ’’, ‘‘రాములో రాములో’’ పాటలు బెస్ట్ ఆల్బమ్స్‌గా నిలిచాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ‘‘పూజా హెగ్డే’’.

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురం సినిమా బ్లాక్‏బస్టర్ హిట్ కొట్టడంతో పూజా పరిస్ధితి మారిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. 2020 నుంచి నేటి వరకు రిలీజైన స్టార్ హీరోల సినిమాలలో కథానాయిక పూజా హెగ్డేనే. ఆమె ఇప్పుడు ఎంత బిజీ అంటే కాల్‌షీట్లు, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలను కూడా వదిలేసుకుంది.

ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్’’, అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘‘ఆచార్య’’, ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘‘బీస్ట్ ’’ చిత్రంలో పూజానే హీరోయిన్. ఇవి కాకుండా పవన్‌ కల్యాణ్- హరీశ్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం. సౌత్‌లో ఎంత స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నా.. ఆమె దృష్టంతా బాలీవుడ్ మీదే వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ముంబైలో ఓ ఫ్లాట్‌ని కొనేసింది పూజ. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్‌ డిజైన్, కలర్‌ వంటి విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.