హైదరాబాద్‌కు స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ 30 లక్షల డోసులు

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్‌ కంటైనర్లు వచ్చాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జీహెచ్ఏసీ) వేదికగా మారింది. మూడో విడతలో 27.9 లక్షల టీకా డోసులు దిగుమతయ్యాయి. ఇప్పటి వరకు భారతదేశానికి దిగుమ‌తైన వ్యాక్సిన్లలో ఇదే అతిపెద్దది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

ఇదీ చదవండి: 2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ

రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ ఆర్‌యూ-9490 విమానం మంగళవారం తెల్లవారుజామున 3:43 గంటల ప్రాంతంలేో టీకాలు తీసుకుని జీహెచ్‌ఏసీకి చేరుకుంది. దీని దిగుమతి ప్రక్రియ అంతా 90 నిమిషాల్లో ముగిసింది. అనంతరం ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు తరలించారు. కాగా.. జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ - వి టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా.. అంతకు ముందు రెండు విడతలుగా స్పుత్నిక్ - వి టీకాలు దిగుమతి అయ్యాయి. ఈ క్రమంలోనే తొలి విడతలో 1.5 లక్షల టీకాలు దిగుమతి కాగా.. రెండో విడతలో 60 వేల డోసులను దిగుమతి అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 30 లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నాయి. జూన్‌ల మరో 50 లక్షల డోసులను పంపిస్తామని రష్యా గతంలో వెల్లడించింది.

More News

కేటీఆర్ రియల్ హీరో.. సోనూసూద్ సూపర్ హీరో!

రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ముచ్చటించుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవ చేస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్‌లో వలస కూలీలకు బస్‌లు ఎరేంజ్ చెయ్యడం, ఈ ఇయర్ కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు,

2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ

క‌రోనాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసే 2డీజీ ఔషధం ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పొడి రూపంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఔష‌ధం.. ఒక మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్ర‌సాద్‌ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ

పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

పాకిస్తాన్‌లో భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఇవాళ ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ అదృశ్యమయ్యాడు.