'స్పైడర్' మరో టీజర్

  • IndiaGlitz, [Saturday,June 17 2017]

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫ‌రెంట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్‌.మురుగదాస్ కాంబినేషన్‌లో తొలిసారి రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ క్రేజ్ నెల‌కొంది.

అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసేలా మ‌రో టీజ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని మురుగ‌దాస్ యోచిస్తున్నాడ‌ట‌. ఈ టీజ‌ర్‌ను మ‌హేష్ పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు.