'స్పైడర్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ తేదీ ఖరారు

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో 'స్పైడర్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్‌ అయి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కాగా, సెప్టెంబర్‌ 15 సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరగనుంది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరుగుతుంది. ఈ ఫంక్షన్‌లో 'స్పైడర్‌' ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

More News

నయన్ కి పోటీగా సంతానం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని,నటసింహం బాలకృష్ణ 102వ చిత్రంని ఒకే టైంలో ఒప్పుకుని

ర‌కుల్‌.. రెండు పండ‌గ‌లు..

రారండోయ్ వేడుక చూద్దాం, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో.. గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు, పెర్‌పార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌ల‌ని తాను చేయ‌గ‌ల‌న‌ని ఫ్రూవ్ చేసుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

800 థియేటర్స్ లో 'స్పైడర్'

మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

పొల్లాచిలో బెల్లంకొండ శ్రీనివాస్ సాహసాలు!!

'డిక్టేటర్ ' వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా

శర్వానంద్ కోసం ప్రభాస్...

శర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో