ఐదు గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న'స్పైడర్'

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫ‌రెంట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఈ చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్‌.మురుగదాస్ కాంబినేషన్‌లో తొలిసారి రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ క్రేజ్ నెల‌కొంది.

ఈ టీజ‌ర్ విడుదలైన 5 గంటల్లోనే 2 మిలియన్‌ వ్యూస్‌ని 'స్పైడర్‌' టీజర్‌ క్రాస్‌ చేసిందంటే ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలను అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

జూన్ 3న కేటీయార్-రామ్ చరణ్ లు విడుదల చేయనున్న 'కాదలి' ఆడియో

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న "కాదలి" ఇప్పటికే రానా, సమంత వంటి స్టార్ లు ప్రమోట్ చేయడం వల్ల విశేషమైన క్రేజ్ ను సంపాదించుకొంది.

చైతు స్థానంలో సందీప్ కిషన్...

రీసెంట్గా నగరం(తమిళంలో మా నగరం) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా మారుతున్నాడు.

రానా కూడా వారిలాగానే...

ఇప్పుడు వెండితెరకు ఎంత ప్రాధాన్యత ఉందో బుల్లి తెరకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందుకే చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా సందడి చేస్తున్నారు.

రేసుగుర్రం బ్యూటీతో బాలయ్య...

హీరోయిజాన్ని డిపరెంట్గా తెరకెక్కించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియాశరన్, ముస్కాన్లు హీరోయిన్స్గా నటిస్తున్నారు.

హీందీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ నటించిన సరైనోడు హిందీ వెర్షన్ కు బీటౌన్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది.