'స్పైడర్ ' టీజర్ ఎప్పుడంటే...

  • IndiaGlitz, [Friday,May 26 2017]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. ప్ర‌స్తుతం రెండు సాంగ్స్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌ర‌గాల్సి ఉంది.

గ్రాఫిక్ వ‌ర్క్ ను కూడా పూర్తి చేసి సినిమాను తెలుగు, త‌మిళంలో సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే టీజ‌ర్ మాత్రం అప్పుడో ఇప్పుడో అంటూ వాయిదా వేస్తూ వ‌చ్చారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ టీజ‌ర్ నిడివి 59 సెక‌న్ల పాటు ఉంటుంద‌ని, ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగ‌దాస్ ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగేలా టీజ‌ర్‌ను క్ట్ చేశాడ‌ని స‌మాచారం.

More News

మగధీర కు సంబంధం లేదట...

జూన్ 9న విడుదల కానున్న బాలీవుడ్ చిత్రం రాబ్తా(కనెక్షన్)కు తెలుగు సినిమా మగధీరకు సంబంధం ఉందని తెలుగు నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

'జయదేవ్' లో గంటా రవి ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్ చేశాడు - దర్శకుడు జయంత్ సి. పరాన్జీ

'ప్రేమించుకుందాం.. రా', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారు బాగున్నారా!' 'లక్ష్మీనరసింహా' వంటి సూపర్డూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి డీసెంట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు జయంత్ సి. పరాన్జీ.

జూన్ 9న విడుదలకానున్న 'పెళ్ళికి ముందు ప్రేమకథ'

చేతన్ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మధు గోపు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'పెళ్ళికి ముందు ప్రేమకథ'. డి.ఎస్.కె, అవినాష్ సలండ్ర, సుధాకర్ పట్నం నిర్మాతలు. ప్రేమ్ కుమార్ పాట్ర, మాస్టర్ అవినాష్ సలండ్ సమర్పణలో గణపతి ఎంటర్టైన్మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్ బ్యానర్స్పై రూపొందుతోంది.

'అందగాడు' సెన్సార్ పూర్తి

యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

కళ్యాణ్ రామ్ చిత్రానికి తమిళ రచయితలు...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో