'SR కల్యాణమండపం' సాంగ్.. మనం అమ్మాయిల్ని తిడితే బూతు..

  • IndiaGlitz, [Tuesday,June 22 2021]

యువ హీరో కిరణ్ అబ్బవరం, క్రేజీ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం SR కల్యాణమండపం. శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు.

సిగ్గెందుకురా ,మావ అనే సాంగ్ ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. హీరో బార్ లో పెగ్గేసుకుంటూ పెర్ఫామ్ చేసే పాటలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సాంగ్ ని కూడా అలాగే డిజైన్ చేశారు. లిరికల్ వీడియోను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ప్రేయసి ఛీ కొట్టినా సర్దుకుపోవాలి అనే కాన్సెప్ట్ ని గమ్మత్తుగా చూపించారు.

బార్ లో హీరో తన స్నేహితులతో మందేసుకుంటూ తన లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తాడు. 'మనం అమ్మాయిల్ని తిడితే అది బూతు.. అదే అమ్మాయిలు మనల్ని తిడితే స్వీటు లాగా ఫీల్ అవ్వాలి' అంటూ హీరో సాంగ్ లోకి వెళతాడు.

భాస్కర భట్ల మాస్ కు చేరువయ్యే సాహిత్యం అందించారు. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని పాడారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రమోద్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

More News

లక్షన్నర హ్యాండ్ బ్యాగ్.. కోపంతో విసిరికొట్టిన అషు రెడ్డి తల్లి!

డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులారిటీ పెంచుకుంది.

సాయి తేజ్ డేరింగ్ స్టెప్.. 'రిపబ్లిక్' కోసం పని మొదలు!

మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

రూ.410 కోట్ల నెట్ వర్త్, 120 కోట్ల ఆదాయం.. థలపతి విజయ్ అంటే ఇది!

సౌత్ లో అత్యథిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో విజయ్ ఒకరు. తమిళనాట రజనీ తర్వాత అభిమానులకు ఆరాధ్య దైవంగా మారుతున్నాడు విజయ్.

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ట్వీట్.. జగన్ పై ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు.

తండ్రి వయసున్న వ్యక్తితో ఎఫైర్, చైల్డ్ కూడా ? హీరోయిన్ పై షాకింగ్ రూమర్స్

చిత్ర పరిశ్రమలో నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది.