close
Choose your channels

కొత్త ట్విస్ట్ ఇచ్చిన నటి శ్రీ సుధ

Wednesday, July 29, 2020 • తెలుగు Comments

కొత్త ట్విస్ట్ ఇచ్చిన నటి శ్రీ సుధ

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్‌ కె నాయుడి తనను పెళ్లి పేరుతో మోసం చేశారంటూ నటి శ్రీ సుధ గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అయితే తాజాగా ఆమె ఎస్‌ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బుధవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి వచ్చిన శ్రీసుధ మురళీకృష్ణ తన వద్ద నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారని.. దానికి సంబంధించిన ఆధారాలను సైతం అధికారులకు అందజేసినట్టు తెలిపారు. శ్యామ్‌ కె నాయుడిని అరెస్ట్ చేయకుండా సీఐ మురళీకృష్ణ రాజీ చేసుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలతో పాటు సీఐతో మాట్లాడిన సాక్ష్యాలను కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందజేసేనట్టు శ్రీసుధ తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz