శ్రీవిష్ణు చిత్రం 'రాజ రాజ చోర'

  • IndiaGlitz, [Saturday,February 29 2020]

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునయన నాయిక. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా నేడు చిత్రం తొలి ప్రచార చిత్రాన్నివిడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. 'హసిత్ గోలి' ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం అవుతున్నారు అని చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు.

శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ నాటికి చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల,క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.

More News

నాని సినిమా కోసం ఆస్కార్ సంగీత ద‌ర్శ‌కుడు

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు.

మ‌రో సినిమాను ట్రాక్‌లో పెడుతున్న ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు కొత్త సినిమాల‌కు ఓకే చెబుతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్‌లో ర‌వితేజ సినిమా చేయబోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

విక్ర‌మ్ 'కోబ్రా' ఫ‌స్ట్ లుక్‌... 7 గెట‌ప్స్‌

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా `కోబ్రా`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్`(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నిరూపిస్తే రాజీనామా చేస్తా..: రోజా సవాల్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు, జిల్లా ప్రజలు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

కొత్త కాన్సెప్ట్‌తో చేసిన హిట్‌ను ఆద‌రించిన అంద‌రికీ థాంక్స్‌: నిర్మాత నాని

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం `హిట్‌`.