close
Choose your channels

BiggBoss: రేవంత్‌కు ఫస్ట్ ప్లేస్, రోహిత్‌కు ‘‘అన్ డిజర్వ్’’ ట్యాగ్... శ్రీసత్యతో శ్రీహాన్ గొడవ

Tuesday, December 6, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 6 తెలుగు 13 వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దిరోజుల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది. గత వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన ఫైమా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంట్లో ఏడుగురు వున్నారు. వారు రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయా, కీర్తి, రోహిత్, ఆదిరెడ్డిలు. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచి శ్రీహాన్ ఆల్రెడీ ఫైనల్‌గా అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఫైనల్‌కు చేరే మిగతా నలుగురు ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇక .. ఈరోజు సోమవారం కావడంతో నామినేషన్స్‌ని వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. ప్రేక్షకులు ఇచ్చే స్థానం కాకుండా.. అసలు మీ అంతట మీరు ఏ స్థానంలో వుండాలని అనుకుంటున్నారో చెప్పాలని కంటెస్టెంట్స్‌కి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక్కడే మరో మెలిక కూడా పెట్టాడు. ఈ ఏడు స్థానాల్లో నెంబర్ గేమ్‌ని బట్టి నామినేషన్స్ వుంటాయని చెప్పాడు. గేమ్‌లో భాగంగా రేవంత్ తనకు తాను తొలి స్థానం ఇచ్చుకోగా.. ఇనయా రెండు, కీర్తి మూడు, శ్రీసత్య నాలుగు, శ్రీహాన్ ఐదు, ఆదిరెడ్డి ఆరు, రోహిత్ ఏడో స్థానాల్లో వుంటామని చెప్పారు. కానీ అందరి అభిప్రాయం తీసుకుని ఈ స్థానాలను మార్చారు బిగ్‌బాస్. దీని ప్రకారం రేవంత్‌కు తొలి స్థానం, శ్రీహాన్‌కు రెండు, ఆదిరెడ్డికి మూడు, ఇనయాకు నాలుగు, శ్రీసత్యకు ఐదు, రోహిత్‌కు ఆరు, కీర్తికి ఏడు స్థానం వచ్చింది.

అనంతరం టికెట్ టూ ఫినాలే‌లో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీహాన్‌కు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ షోకి ఎవరు డిజర్వ్, ఎవరు అన్‌ డిజర్వ్ అనేది చెప్పాలని ఆదేశించారు. దీంతో శ్రీహాన్ మరో మాట లేకుండా రోహిత్‌కి ‘‘అన్ డిజర్వ్’’ ట్యాగ్ ఇచ్చాడు. మీరు చాలా మారారని, పదవ వారం తర్వాత మార్పు కనిపించిందని కామెంట్ చేశాడు శ్రీహాన్. దీనికి రోహిత్ స్పందిస్తూ.. తానేం మారలేదని, మొదటి నుంచి ఇంతే అన్నాడు. దీనిపై కాసేపు వాగ్వాదం జరగ్గా.. మీరిచ్చారు, నేను తీసుకున్నాను ఖతమ్ అన్నాడు రోహిత్.

తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీహాన్, శ్రీసత్యల గురించే. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు వీరిద్దరూ ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే శ్రీసత్య హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి శ్రీహాన్ తన స్ట్రాటజీ మార్చేశాడు. ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. అటు శ్రీసత్య కూడా ఇనయాతో స్నేహంగా వుంటోంది. టికెట్ టు ఫినాలే టాస్క్ సందర్భంగా ఇనయా, కీర్తి, శ్రీసత్యలు సంచాలక్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమ్మాయిలు ఒక గ్రూప్‌గా.. అబ్బాయిలంతూ మరో గ్రూప్‌గా వుండి గొడవ పడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై శ్రీసత్యతో ఈరోజు వాదనకు దిగాడు శ్రీహాన్.

ఇదిలావుండగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచే సందర్భంగా బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ గెలిచే ప్రైజ్‌మనీలో కోత విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదిరెడ్డి సహా పలువురు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. అటు అభిమానులు, ప్రేక్షకులు కూడా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రైజ్‌మనీని తిరిగి ఇచ్చేందుకు అవకాశం కల్పించాడు. ఇందులో శ్రీసత్య, రోహిత్ టాస్క్‌ పెట్టగా.... శ్రీసత్య గెలిచింది. దానికి ముందే ఇంటి సభ్యులను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి.. శ్రీసత్య, రోహిత్‌లలో ఎవరు గెలుస్తారో చెప్పాలని ఆదేశించాడు. దీనికి అంతా రోహితే గెలుస్తారని చెప్పాడు. కానీ శ్రీసత్య గెలవడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

మొత్తంగా చూస్తే... శ్రీహాన్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా... మిగిలిన ఆరుగురు ఇంటి సభ్యులంతా నామినేషన్స్‌లో వున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.