close
Choose your channels

‘శ్రీకారం’ ట్రైలర్: వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన శర్వా

Saturday, March 6, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘శ్రీకారం’ ట్రైలర్: వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన శర్వా

శర్వానంద్ సినిమాలంటేనే కుటుంబం మొత్తం హ్యాపీగా చూడగలిగేలా ఉంటాయని టాక్ ఉంది. అద్భుతమైన కథలను ఎంచుకోవడంలో శర్వాకు శర్వాయే సాటి. అందుకే ఆయన సినిమాలన్నీ దాదాపు మంచి సక్సెస్ సాధిస్తాయి. ప్రస్తుతం శర్వా హీరోగా కిశోర్‌ తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. యంగ్ హీరోస్ వరుణ్ తేజ్, నాని, నితిన్‌‌ల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు.

నగరంలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు.. అనూహ్య పరిస్థితుల్లో గ్రామానికి వచ్చి వ్యవసాయం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగిన తీరును ట్రైలర్‌లో దర్శకుడు చూపించారు. శర్వా ప్రేమను పొందేందుకు ప్రియాంక పడే పాట్లు ఆకట్టుకున్నాయి. శర్వానంద్‌ వ్యవసాయం గురించి చెప్పే సంభాషణలు మెప్పిస్తున్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.