జూలై 14న టీమ్-5 విడుదల

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో బౌల‌ర్ గా, క్రికెట‌ర్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే సినిమా ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడు. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. సురేష్ గోవింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ఊపిరి, ప్రేమ‌మ్, మ‌జ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాల‌కు సంగీతం అందించిన గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించడం విశేషం. తెలుగు, త‌మిళ, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని, జూలై 14న ఈ సినిమావిడుద‌లకు సిద్ధ‌మైంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజ్ జ‌కారియాస్‌కొచ్చి మాట్లాడుతూ, ''ఇప్ప‌టివ‌ర‌కు క్రికెట‌ర్ గా, బౌల‌ర్ గానే పేరున్న మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్ కు ఈ సినిమాతో మంచి న‌టుడిగా కూడా పేరు వ‌స్తుంది. అడ్వెంచ‌ర్ స్పోర్ట్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ రేస‌ర్ గా ఎంతో ఈజ్ తో న‌టించాడు. ఈ చిత్రం ఖ‌చ్చితంగా త‌న‌కు మంచి డెబ్యూ అవుతుంది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా మొత్తం కొన‌సాగుతుంది.అయితే కేవ‌లం స్పోర్ట్స్ యే కాకుండా ఈ చిత్రంలో యాక్ష‌న్, మాస్, ల‌వ్ ఇలా అన్నిర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.ఇలా బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుని, యూ స‌ర్టిఫికేట్ పొందింది. గోవా, బెంగ‌ళూరు మ‌రియు ఆస్ట్రేలియాల్లో ఈ చిత్రాన్ని ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌కుండా చిత్రీక‌రించాం. గోపీ సుంద‌ర్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వ‌ర‌లోనే మ‌ధురా ఆడియో ద్వారా మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌నున్నాం'' అన్నారు.

సురేష్ గోవింద్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ స‌ర‌స‌న నిక్కీ గ‌ల్రానీ, పెర‌ల్ మానే జ‌త క‌ట్ట‌నున్నారు. మ‌క‌రంద్ దేశ్‌పంథే ఒక కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు.

More News

విశాల్ 'విలన్' లుక్ అదిరిందిగా...

తెలుగు, తమిళ చిత్రాలతో తన కంటూ ఓ మార్కెట్ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. ఇప్పుడు మలయాళంలో కూడా నటించబోతున్నాడు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటిస్తున్న చిత్రం విలన్లో విశాల్ విలన్గా కనపడనున్నాడనేది తెలిసిందే.

'2.0' ప్రమోషన్స్ స్టార్ట్...

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సైంటిఫికల్ విజువల్ వండర్ '2.0'.

నాని మూవీలో బాలీవుడ్ నటుడు...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో

'జయదేవ్'తో గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ మాళవికా రాజ్ హీరోయిన్ గా డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో

జూలై 7న 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' గ్రాండ్ రిలీజ్

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు.