ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన శ్రీదేవి కొత్త చిత్రం 'మామ్ ' మోషన్ పోస్టర్

  • IndiaGlitz, [Thursday,April 13 2017]

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌'. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్‌ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో డిఫరెంట్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ మోషన్‌ పోస్టర్‌ రూపొందింది. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత శ్రీదేవి నటిస్తున్న మరో మంచి చిత్రం 'మామ్‌'. ఆస్కార్‌ అవార్డ్స్‌ విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌.

More News

ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న 'దడ పుట్టిస్తా'

విన్నీ వియాన్ కథానాయకుడిగా పి.జె.ఆర్ & ఏన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం "దడ పుట్టిస్తా". రోమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్.ఇ దర్శకుడు.

జి. నాగేశ్వరరెడ్డి ఆవిష్కరించిన 'ఆ నిముషం' లోగో, టీజర్

వేంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ (వి.ఎం.ఎఫ్)బ్యానర్పై కళా రాజేష్ దర్శకత్వంలో 34 మంది నూతన నటీనటులతో యువ నిర్మాత కోటపాటి ప్రసాద్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ నిముషం’.

ఏప్రిల్ 14న ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ 'ఎప్పటికీ ప్రేమ'

ధృవ, అదితి ఆర్య( ఇజం ఫేమ్) కాంబినేషన్లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ `ఎప్పటికీ ప్రేమ` ఏప్రిల్ 14న విడుదల కానుంది. 300కు కైగా థియేటర్స్ షోస్ చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

వి4 మూవీస్ లో ఆది కి ఆఫర్

రెండు మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలసి లిమిటెడ్ బడ్జెట్ లో మంచి అభిరుచి వున్న చిత్రాలు నిర్మించే సాంప్రదాయం

ఆ సినిమా ఆగిపోలేదంటున్న నిర్మాత

కంగనా రనౌత్ `క్వీన్` చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడంలో నిర్మించడానికి సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ రీమేక్ హక్కులను స్వంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ రీమేక్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో త్యాగరాజన్ స్పందించారు.