జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవి 'మామ్'

  • IndiaGlitz, [Saturday,May 20 2017]

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల తెలుగు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్స్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే 'మామ్‌' కోసం హీరోని శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ సెలెక్ట్‌ చేయడం. 2007లో విడుదలైన 'ఎ మైటీ హార్ట్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో ఏంజెలినా జోలీ సరసన నటించిన అద్నన్‌ సిద్ధిఖి అయితే శ్రీదేవికి కరెక్ట్‌ జోడీ అని గుర్తించిన కూతురు జాన్వి కపూర్‌ ఈ విషయాన్ని తండ్రి, ప్రొడ్యూసర్‌ అయిన బోనీకపూర్‌ దృష్టికి తీసుకెళ్ళడం, అతను ఓకే అనడం, అద్నన్‌ని టెస్ట్‌కి పిలిపించడం జరిగిపోయింది. లుక్‌ టెస్ట్‌ చేసిన తర్వాత జాన్వి సెలెక్షన్‌ కరెక్ట్‌ అని శ్రీదేవి సరసన నటించేందుకు అద్నన్‌ సిద్ధిఖీనే ఎంపిక చేశారు నిర్మాత బోనీకపూర్‌, దర్శకుడు రవి ఉద్యవార్‌. అప్పటి వరకు ఆ క్యారెక్టర్‌ ఎవర్ని సెలెక్ట్‌ చెయ్యాలా అని ఆలోచిస్తున్న యూనిట్‌కి జాన్వి పరిష్కారం చూపించింది. అలా శ్రీదేవికి జోడీని సెలెక్ట్‌ చేయడంలో జాన్వి కపూర్‌ వార్తల్లోకి ఎక్కింది.

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌

More News

చైతు సినిమా సెన్సార్ పూర్తి...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

మూడు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న రారండోయ్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

'అంధగాడు' ట్రైలర్ విడుదల

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఫ్యాన్స్ సమక్షంలో నిరాడంబరంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ.. అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు (మే 20).

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం రా..రా...

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,