'దేవిశ్రీప్రసాద్' టీజర్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - దర్శకుడు శ్రీ కిషోర్

  • IndiaGlitz, [Wednesday,April 12 2017]

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ 'దేవిశ్రీప్ర‌సాద్‌'.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.
టీజ‌ర్‌కు వ‌స్తోన్న స్పంద‌న‌పై ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ మాట్లాడుతూ ..దేవి శ్రీ ప్ర‌సాద్ టైటిల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసినప్ప‌టి నుండి సినిమాపై అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్‌ను ఇప్ప‌టికి అన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌లో రెండు మిలియ‌న్స్‌కు పైగా వీక్షించారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణతో పాటు, సినిమా సెన్సార్ అవుతుందో లేదోన‌ని కూడా కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే సినిమాను సెన్సార్ నిబంధ‌న‌ల‌కు లోబడే తెర‌కెక్కించాం. సొసైటీ లో జరిగే చీకటి కోణం ని చూపించడానికి ఎవ్వరు ముందుకు రారు, ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. మన సమాజం లో ఎంతో మంది సైకోలు మన మధ్యలో మనకు తెలియకుండా ఉన్నారు. పుట్టిన పసి కందు నుండి చచ్చిన శవం వరుకు అంతెందుకు జంతువులను కూడా వదలకుండా పైశాచిక ఆనందం పొంతుతున్నారు. చివరికి తల్లి గర్భం లో కూడా ఆడ శిశువుకి ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా పోయింది. మన చుట్టూ సమాజం లో జరిగే నిజమైన సంఘటలను ఆధారంగా తీసుకొని స్త్రీ జాతి ఉనికి తెలియజేయడానికి చేసిన ప్ర‌య‌త్న‌మే మా దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రం అని తెలిపారు.

More News

యదార్థ ఘటన ఆధారంగా 'డేగల శ్రీను' ప్రారంభం

ఆర్.ఎఫ్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అమర్నాథ్ మండూరి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం బుదవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

నాని హీరోయిన్ తో నితిన్...

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లై`. 14 రీల్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత నితిన్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

నాని దర్శకుడితో అల్లుడు శీను..

హీరో నాని రీసెంట్ హిట్ `నేను లోకల్`. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశాడు. అంతకు ముందు రాజ్ తరుణ్తో సినిమా చూపిస్తమావ సక్సెస్ను సాధించాడు త్రినాథరావు నక్కిన, ఈ డైరెక్టర్తో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వర్క్ చేయబోతున్నాడట.

ఫ్యానీ రేటు నాని సినిమా థియేట్రికల్ రైట్స్...

వరుస సక్సెస్లను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు డివివి దానయ్య నిర్మాత శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న `నిన్ను కోరి` చిత్రంలో నటిస్తున్నాడు.

స్కూలు కెళుతున్నట్లుంది అంటున్న ఖుష్బూ

తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఖుష్బూ సుపరిచితమే..కాలక్రమేణ తమిళ ప్రేక్షకులకు దగ్గరై గుడి కట్టించుకునే రేంజ్ అభిమానులను సంపాదించుకుంది. అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది. రీసెంట్గా పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాలో ఖుష్బూ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.