శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ప్రీమియర్ షోస్ కు అనూహ్య స్పందన

  • IndiaGlitz, [Tuesday,May 23 2017]

గాయత్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కెఎన్.రావ్ నిర్మాణంలో, నరేష్ పెంట దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలౌతోంది. అయితే చిత్ర యూనిట్ సినిమా మీదున్న నమ్మకంతో... వారం రోజుల ముందు నుంచే హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు వరుసగా వివిధ వయసుల వారికి ప్రత్యేకంగా షోస్ వేస్తూ వస్తోంది. ప్రతీ షోకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. పల్లెటూరి ప్రేమ కథను హృద్యంగా... భావోద్వేగాల్ని మిళితం చేసి చూపించారనే పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా దర్శకుడు నరేష్ పెంట... హీరోగా నటించిన శేఖర్, హీరోయిన్ గా నటించిన దీప్తి శెట్టి, హీరోయిన్ తండ్రిగా నటించిన మధు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. దర్శకుడు అద్భుతమైన ప్రేమ కథను పల్లెటూరి వాతావరణంలో చక్కగా చూపించాడనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. తండ్రిగా నటించిన మధు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. హీరో శేఖర్, మధు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయంటున్నారు. ప్రతీ ఒక్కర్ని ఆలోచింపచేసే విధంగా ఉన్న ఈ సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు, రీరికార్డింగ్ కుదిరాయని అంటున్నారు. దర్శకుడే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో మంచి సంగీతం ఈ సినిమా ద్వారా పొందగలిగాం అనే కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి.
అన్నట్టు ఈ చిత్ర బిజినెస్ కూడా చక చకా జరుగుతోంది. ప్రీమియర్ షోస్ రిపోర్ట్ కనుక్కొన్న డిస్ట్రిబ్యూటర్స్... ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండడం విశేషం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట చిత్రాన్ని కూడా అదే రీతిన ఆదరిస్తారనే నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.

More News

భ్రమరాంబ క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను - రకుల్ ప్రీత్ సింగ్

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం'.

ఆడవాళ్ళపై నోరు జారిన చలపతిరావు

సీనియర్ నటుడు ఎన్నో సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన సీనియర్ యాక్టర్ చలపతిరావును అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.

ముస్తాబవుతున్న గువ్వ గోరింక

వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో.. పూర్తి సహజమైన పాత్రలతో..

ముగాంబికను దర్శించుకున్న అనుష్క

దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరైన అనుష్క ఇప్పుడు ఓ రకంగా వివిఐపి స్టేటస్ను అనుభవిస్తుందనుకోవాలి. అందుకు కారణం బాహుబలి-2. దేవసేనగా బాహుబలి-2లో మెప్పించిన అనుష్క బయట మాత్రం చాలా డీసెంట్గా కనపడతుంది.

రకుల్ ప్రీత్ విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' టీజర్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి.