close
Choose your channels

మళ్ళీ టాలీవుడ్‌పై గురిపెట్టిన శ్రీరెడ్డి.. ఈసారి మహేశ్ బాబునే అలా అనేసింది

Monday, September 20, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మళ్ళీ టాలీవుడ్‌పై గురిపెట్టిన శ్రీరెడ్డి.. ఈసారి మహేశ్ బాబునే అలా అనేసింది

తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నటిగా కంటే కాంట్రవర్సీలతోనే విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంది. తనని టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకొని వదిలేశారని అప్పట్లో శ్రీరెడ్డి చేసి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందే అర్థనగ్నంగా ధర్నా చేసి కలకలం రేపింది. పరిశ్రమలోని హీరోలు, దర్శకుల గురించి, నిర్మాతల కొడుకుల గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో సెన్షేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇంత చేసినా కూడా ఆమెను ఎవరూ టార్గెట్ చేయకపోవడం ఆసక్తికరం.

మళ్ళీ టాలీవుడ్‌పై గురిపెట్టిన శ్రీరెడ్డి.. ఈసారి మహేశ్ బాబునే అలా అనేసింది

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడటంతో ఆయన అభిమానుల ధాటికి తట్టుకోలేక సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా తన మకాంను చెన్నైకి మార్చింది. పోనీ అక్కడైనా బుద్ధిగా వుండకుండా ఇదే తంతు సాగించింది. కోలీవుడ్ ప్రముఖుల మీద ఇలాంటి కామెంట్సే చేసి వార్తల్లో నిలిచింది. రాను రాను జనాలు ఈమెను పట్టించుకోకపోవడంతో ఈ మధ్య శ్రీరెడ్డి హడావుడి తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.

మళ్ళీ టాలీవుడ్‌పై గురిపెట్టిన శ్రీరెడ్డి.. ఈసారి మహేశ్ బాబునే అలా అనేసింది

ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబునే టార్గెట్ చేసింది. అయితే అది నెగిటివ్‌గా కాదు పాజిటివ్‌గా. ‘‘ సిమ్లా ఆపిల్ లా ఉన్నాడు బాబు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. సైమా అవార్డ్స్ 2021 కి గానూ మహేశ్ బాబుకి ఆయన నటించిన మహర్షి సినిమాకి అవార్డు దక్కించింది. ఇందులో భాగంగా ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అవార్డుల కోసం సైమా అవార్డ్స్ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి రెడ్ కార్‌పేట్‌పై వస్తున్న మహేశ్ స్టిల్ ట్యాగ్ చేసి సిమ్లా ఆపిల్ లా ఉన్నాడు బాబు అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.