'F2' లో శ్రీరెడ్డి డైలాగ్.. ప్రేక్షకులంతా ఫసక్!
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్లు ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో సినిమాకెళ్లిన సినీ ప్రియులు, అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ పొంగల్‌కు వచ్చిన మిగతా సినిమాలతో పోలిస్తే సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రావడంతో థియేటర్లకు జనాలంతా క్యూ కడుతున్నారు. ఈ సినిమాకెళ్లిన అభిమానులు కొన్ని కొన్ని డైలాగ్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇవి ఎక్కడో విన్నామే అని ఆలోచిస్తున్నారు.
ముఖ్యంగా సినిమా చివర్లో '90 డిగ్రీస్‌లో నా కళ్లలోకి చూడు' అనే డైలాగ్ వచ్చినప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటూ హడావుడి చేసి చెన్నై చెక్కేసిన బోల్డ్ యాక్టర్ శ్రీరెడ్డి గుర్తొచ్చిందని సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. కాగా శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో '90 డిగ్రీస్' అంటూ బోల్డ్‌గా మాట్లాడిన మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ 'ఎఫ్2'లో '90 డిగ్రీస్’' అని రావడంతో థియేటర్లలోని జనాలకు శ్రీరెడ్డి పేరు టక్కున గుర్తొంచ్చిందట.
ఇక 'ఫసక్' విషయానికొస్తే.. ఈ డైలాగ్ సీనియర్ నటుడు మంచు మోహన్ ది. ఆయన ఏ మూడ్‌లో 'ఫసక్' అన్నారోగానీ.. విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అది కాస్త మళ్లీ సినిమాల్లో వాడుకునేంత వెళ్లిదంటే అర్థం చేస్కోవచ్చు. ఈ 'ఎఫ్2' నటించిన ఓ నటికి అచ్చంగా ఈ చిన్న డైలాగ్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వెంకీ, వరుణ్ కామెడీకి మధ్య మధ్యలో ‘ఫసక్’ అనిపించారు. మొత్తానికి చూస్తే సినిమా మొత్తం మీద ఉన్న మెయిన్ డైలాగుల్లో ఈ ‘90 డిగ్రీస్’, ‘ఫసక్’ అనే రెండు సరైన సందర్భాల్లో వాడారని డైరెక్టర్‌ను మెచ్చుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.