రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటున్న శ్రీరెడ్డి

  • IndiaGlitz, [Sunday,November 17 2019]

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో తెలుగు సినిమాల్లో ప్ర‌ముఖంగా విన‌ప‌డిన పేరు శ్రీరెడ్డి. ప‌లువురి తెలుగు, త‌మిళ హీరోలు త‌న‌తో ర‌హ‌స్యంగా గ‌డిపారంటూ ఈమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. తాజాగా ఈమె ఫేస్‌బుక్ ఫేజీలో హీరో, దివంగ‌త క‌రుణానిధి మ‌న‌వ‌డు, స్టాలిన్ రాజ‌కీయ వార‌సుడు ఉద‌య‌నిధి స్టాలిన్ త‌న‌తో ర‌హ‌స్యంగా గ‌డిపాడంటూ న్యూస్ పోస్ట్ చేసింది. ఈ వ్య‌వ‌హారం ఇటు సినీ, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేదంటూ శ్రీరెడ్డి చెన్నైలో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించి తెలియ‌జేసింది. ఉద‌య‌నిధిని డైరెక్ట్ ఎప్పుడూ చూడ‌లేద‌ని శ్రీరెడ్డి తెలిపారు.

ఆమె మాట్లాడుతూ ''క‌రుణానిధి కుటుంబంపై గౌర‌వ మ‌ర్యాద‌లున్నాయి. ఉద‌య‌నిధిని నేరుగా చూడ‌లేదు. ఆయ‌న గురించి మెసేజ్ పోస్ట్ చేసిన అకౌంట్ నాది కాదు. నా పేరు ఫేస్ బుక్‌లో చాలా న‌కిలీ ఖాతాలున్నాయి. వీటిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొంటున్నార‌ని నేను బాహాంట‌గానే చెప్పాను. తెలుగు చిత్ర‌సీమ‌లో నాకు మ‌ద్ద‌తు ద‌క్క‌లేదు. అయితే త‌మిళ చిత్ర‌సీమ‌లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాను. నేను చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల‌నుకుంటున్నాను. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటున్నాను. అయితే ఏ పార్టీలో చేర‌తాన‌నే విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేను'' అన్నారు.

More News

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'రాజా నరసింహ' థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ

రాజా చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు!  ''అదొక మారుమూల అటవీ ప్రాంతం.

'90ml'  'సింగిలు సింగిలు' పాట సుజనా మాల్ లో విడుదల

హీరో కార్తికేయ నటించిన 90ml 'సింగిలు సింగిలు' పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

'పిచ్చోడు' నవంబర్ 22న విడుదల

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు.

'జార్జ్‌రెడ్డి' కి తెలంగాణ ప్ర‌భుత్వం షాక్‌

సందీప్ మాధ‌వ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `జార్జ్‌రెడ్డి`. జీవ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ న‌వంబ‌ర్ 22న విడుద‌ల కానుంది.

జబ‌ర్‌ద‌స్త్ నుండి నాగబాబు వైదొలగడానికి కారణం ఇదే?

టీవీ కామెడీ షోస్‌లో ఈటీవీ జ‌బ‌ద‌స్త్ ప్రోగ్రామ్ స‌క్సెస్ అయినంత మ‌రే ప్రోగ్రామ్ కూడా స‌క్సెస్ కాలేదు.