RIP అంటూ హీరోయిన్‌పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

  • IndiaGlitz, [Monday,February 03 2020]

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మరోసారి వార్తల్లో నిలిచింది. నిత్యం వివాదాలే ఊపిరిగా బతుకుతున్న శ్రీరెడ్డి ఎవర్ని పడితే వార్ని గోకుతూ హడావుడి చేస్తుంటుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ దాదాపు అందర్నీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ హాట్ భామ తాజాగా.. టాలీవుడ్ నటి కమ్ బీజేపీ మహిళా నేత అయిన మాధవిలతను టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్ట్ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో మాధవీలత తన ఆరోగ్యంపై ఓ పోస్ట్ చేయగా.. దానిపై స్పందించిన శ్రీరెడ్డి ఇలా రియాక్ట్ అయ్యింది.

సారీ మాధవీ..!

‘RIP మాధవీ లత.. సారీ నువ్వింకా పోలేదా’? అని షాకింగ్ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. ఎందుకిలా తయారయ్యావ్..? మాధవీ కాదు.. నువ్వు పో శ్రీరెడ్డి అంటూ అంటూ పలువురు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరెడ్డి పోస్ట్‌కు మాధవీలత ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి. కాగా.. ‘ఏదో ఒక రోజు ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లు తానుకూడా ఏ మందులు పనిచేయక ఒకరోజు చనిపోతానని తన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెబుతూ ఉంటాను’ అని మాధవీలత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.