close
Choose your channels

'కల్కి' రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్' పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ " సినిమా ప్రేక్షకులకు నమస్కారం. 'కల్కి' రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమాకు ముందు వచ్చిన రాజశేఖర్ గారి 'గరుడవేగ' పెద్ద సక్సెస్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'అ!' చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఇండియాలోనూ, ఓవ‌ర్‌సీస్‌లోనూ ఆ సినిమా బాగా ఆడింది. ఇక, ఫస్ట్ రిలీజ్ అయిన 'కల్కి' మోషన్ పోస్టర్, తరవాత విడుదలైన టీజర్, ఆ తరవాత వచ్చిన కమర్షియల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్, హైప్ వచ్చాయి. క్రేజ్, కంటెంట్ చూసి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేం రెడీ అయ్యాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెయిన్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నాం.

అదింకా హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకులు ఆ ట్రైల‌ర్‌నూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. జూన్ 28న సినిమా విడుదలవుతుంది. ప్రేక్షకులు చిత్రానికి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారు అద్భుతంగా చేశారు. ఆయన కామెడీ టైమింగ్ బావుంటుంది. ఆయన్ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. 'గరుడవేగ'లో ఎంత బాగా చేశారో చూశారు. ఈ సినిమా కమర్షియల్ ట్రైల‌ర్‌లో ఆయన కామెడీ టైమింగ్‌ను చాలామంది మెచ్చుకున్నారు. అదా శర్మ, నందితా శ్వేత తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమా చాలా బావుంటుంది. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. శ్రవణ్ భరద్వాజ్ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. ఇందులో ఒక ప్రత్యేక గీతం కూడా ఉంది. 'గరుడవేగ'లో సన్నీ లియోన్ 'డియో డియో' చేసినట్టు... ఇందులో స్కార్లెట్ విల్సన్ 'హార్న్ ఓకే ప్లీజ్' చేశారు. ఆ పాట ప్రేక్షకులకు మంచి ఉత్తేజాన్ని అందిస్తుంది. అన్ని రకాల హంగులు ఉన్న చిత్రమిది. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు సినిమాకు పనిచేశారు. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న సినిమా తప్పనిసరిగా బావుంటుంది. ఆ నమ్మకంతో 'కల్కి'ని విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.