Bhaag Saale: 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ విడుదల!!

  • IndiaGlitz, [Friday,October 07 2022]

నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.

టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో యువ హీరో శ్రీ సింహా, అర్జున్ పాత్రలో నటిస్తుండగా నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుంది. జాన్ విజయ్ మరియి నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు.

ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఇందులో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటిస్తుండగా చిత్ర విజయం పై మాకు పూర్తి నమ్మకముంది. అన్నారు.

సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.

నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల

నటీనటులు: శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి

More News

BiggBoss: నా కుక్కల బొచ్చు కావాలి.. గీతూ కోరికకి షాకైన బిగ్‌బాస్, కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు

పుట్టినరోజు వేడుకలని చెప్పి గడిచిన రెండు రోజులుగా ఇంటిలో ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు బిగ్‌బాస్.

YSRCP : ఫ్యాన్‌కి ఓటేయ్యకపోతే పెన్షన్లు ఆగిపోతాయి.. ఓటర్లను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే , ట్రోలింగ్

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే.

Godfather : బాస్ ఈజ్ బ్యాక్.. రెండో రోజూ తగ్గని 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్, హిందీలోనూ చిరు మేనియా

గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ స్టామినా చూపించలేకపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 కలెక్షన్లు కుమ్మేసినప్పటికీ తర్వాత రిలీజ్

ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 నూతన చిత్రం 'జిలేబి' గ్రాండ్ గా ప్రారంభం

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్

Nagababu: చిరంజీవి అంటే ఎవరికైనా అసూయే... అది ఏ ‘‘పాటి’’కైనా : గరికపాటికి నాగబాబు స్వీట్ కౌంటర్

కొణిదెల నాగబాబు.. మెగా బ్రదర్స్‌లో ఒకరు. ఒడ్డూ, పొడుగు అంతా బాగున్నప్పటికీ ఎందుకో ఆయన హీరోగా క్లిక్ కాలేదు.