కొత్త ట్రెండ్ కి శ్రీ శ్రీ శ్రీకారం

  • IndiaGlitz, [Saturday,May 28 2016]

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించిన చిత్రం శ్రీ శ్రీ. ఈ చిత్రాన్ని ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో కూడా రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...తెలుగు వారంద‌రికీ వినోద సాధ‌నం సినిమా. 50 ఏళ్ల క్రితం తేనె మ‌న‌సులు అనే ఈస్ట్ మ‌న్ క‌ల‌ర్ చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌యం అయ్యాను. గూడ‌చారి 117, అల్లూరి సీతారామ‌రాజు, సింహాస‌నం...ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించాను. శ్రీ శ్రీ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేస్తున్నాం. అదే రోజున విదేశాల్లో శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నాం అన్నారు.

విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ...ముప్ప‌ల‌నేని శివ క‌థ చెప్పిన వెంట‌నే నాకు బాగా న‌చ్చింది. సెంటిమెంట్ డ్రామాతో ఉన్న ఈ క‌థ అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్ని జ‌న్మ‌ల బంధ‌మో...అనే పాట ఉంది. ఆ పాట మా నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది అన్నారు.

డైరెక్ట‌ర్ ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ...పండంటి కాపురం చిత్రం చూసి కృష్ణ గారి అభిమాని అయ్యాను. ఎన్నోవిజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కృష్ణ గార్ని డైరెక్ట్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

More News

హైదరాబాద్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' రెండో షెడ్యూల్

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా రూపొందుతోన్న ప్రెస్టీజియస్ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.

'పనిలేని పులిరాజు' మోషన్ డైలాగ్ పోస్టర్ విడుదల

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం పనిలేని పులిరాజు.

చైతు మూవీ డేట్ ఎనౌన్స్ చేసిన గౌతమ్ మీనన్

నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగా సాగిపో.

ఆ వార్త‌ల‌ను ఖండించిన పి.వి.పి..

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు  బ‌లుపు, వ‌ర్ణ‌, సైజ్ జీరో, క్ష‌ణం, ఊపిరి, బ్ర‌హ్మోత్స‌వం త‌దిత‌ర‌ చిత్రాల‌ను నిర్మించింది. మ‌హేష్ బాబుతో నిర్మించిన బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఫెయిలై..ఫ్లాప్ మూవీగా నిలిచింది.

గౌతమీపుత్ర శాతకర్ణిలో కథానాయిక ఎవరు..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.