రెహ్మాన్ ని కదిలించిన శ్రీధర్

  • IndiaGlitz, [Saturday,January 06 2018]

ఎ.ఆర్.రెహ్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. సంగీత ప్రియులని తన సంగీతంతో గ‌త పాతికేళ్లుగా మంత్ర ముగ్ధులను చేస్తున్న స్వర మాంత్రికుడు రెహ్మాన్‌. మణిరత్నం రోజా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత వరస సినిమాలతో, ఎన్నో మ్యూజికల్ హిట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. అయితే తన సంగీతంతో ఎంతో మంది మదిని దోచిన రెహ్మాన్‌ని ఏదీ అంత తొందరగా ఆకట్టుకోద‌ని..చివరికి తన సంగీతమైనా తనను ఆకట్టుకునేంత వరకు శ్రమిస్తూనే ఉంటాడ‌ని.. ఆయ‌న‌తో ప‌నిచేసే సినీ ప్రముఖులు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అటువంటి రెహ్మాన్‌ని ఎవరైనా ఆకట్టుకునేలా చేస్తే? సరిగ్గా ఇలానే చేసి చూపించారు చెన్నైకి చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీధర్. ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా..25 వేర్వేరు సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఉన్న 25 రెహ్మాన్ల చిత్రాల్ని చిత్రీకరించి...రెహ్మాన్‌కు ఆయ‌న‌ బహూకరించారు. ఆ చిత్రానికి ముగ్ధుడైన రెహ్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ చిత్రాన్నిపోస్ట్ చేస్తూ...“చెన్నైకి చెందిన చిత్రకారుడు శ్రీధర్ తన ప్రేమతో, గౌరవంతో నన్ను కదిలించారు” అని ట్వీట్ చేసారు. అన్న‌ట్టు.. ఈ రోజు ఈ స్వ‌ర‌మాంత్రికుడు పుట్టిన‌రోజు.

More News

పవన్ లోని రెండు గుణాలు ఆ స్టార్స్ లోనూ ఉన్నాయట

తెలుగులో రెండే రెండు సినిమాల్లో నటించి..

త‌క్కువ గ్యాప్‌లో నాలుగు సూప‌ర్ హిట్ సాంగ్స్‌

భాస్కరభట్ల రవికుమార్.. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో మాస్, రొమాంటిక్, మెలోడీ పాట‌ల‌కు సాహిత్యాన్ని అందించిన గీత ర‌చ‌యిత‌. కాకపోతే మాస్ పాటలే ఆయన బలం. ఈ సంక్రాంతికి విడుదల కానున్న రెండు పెద్ద సినిమాల్లో మూడు పాటలు.. ఈ రచయిత కలం నుంచి జాలువారినవే.

'జువ్వ' మోషన్ పోస్టర్ విడుదల

రంజిత్,పాలక్ లల్వానీ హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'జువ్వ'.

జూన్‌ నుంచి జయ బి. దర్శకత్వంలో కొత్త చిత్రం

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు. జనవరి 7 నిర్మాత బి.ఎ.రాజు పుట్టినరోజు సందర్భంగా తమ ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మి&

'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ రేపు విడుదల

'దేనికైనా రెడీ','ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు