close
Choose your channels

చిరు చిన్న‌ల్లుడి చ‌పాతీలు.. శ్రీజ సెటైర్‌

Monday, May 25, 2020 • తెలుగు Comments

చిరు చిన్న‌ల్లుడి చ‌పాతీలు.. శ్రీజ సెటైర్‌

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం, షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ తార‌లంద‌ర ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వీరంద‌రూ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా.. ఇంటి ప‌నులు, వంట ప‌నులు కూడా చేస్తున్నారు. లేటెస్ట్‌గా చిరంజీవి చిన్నల్లుడు, హీరో క‌ల్యాణ్‌దేవ్ భార్య శ్రీజ కోసం చ‌పాతీలు చేశాడు. అయితే చివ‌ర‌కు ఆ చ‌పాతీలను బేస్ చేసుకుని శ్రీజ సెటైర్ వేసింది. ఇప్పుడు శ్రీజ పోస్ట్ చేసిన సెటైరిక‌ల్ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది.

‘‘సాధారణంగా ఈ లాక్‌డౌన్‌లో ఎవ‌రూ ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తులు లేవు. అయితే క‌ల్యాణ్ మాత్రం క‌ష్ట‌ప‌డి న‌న్ను ఆఫ్రికా, ఆస్ట్రేలియాల‌కు తీసుకెళ్లాడు. చపాతీలు ఎలాంటి ఆకారంలో ఉండాల‌ని అనే దానికంటే ఎంత రుచిగా ఉన్నాయ‌నేది చాలా ముఖ్యం. మీరు చేసిన చ‌పాతీల వీడియో, ఫొటోల‌ను షేర్ చేస్తే వాటిని మా స్టేట‌స్‌లో పెట్టుకుంటాం’’ అన్నారు శ్రీజ‌. చిరంజీవి రెండో అల్లుడు క‌ల్యాణ్‌దేవ్ తొలి చిత్రం ‘విజేత‌’. ఈ సినిమా త‌ర్వాత క‌ల్యాణ్ దేవ్ హీరోగా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న‌ ‘సూప‌ర్‌మ‌చ్చి’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz