'అమ్మాయిలంతే..అదో టైపు' ట్రైలర్ ఆవిష్కరించిన శ్రీకాంత్ అడ్డాల

  • IndiaGlitz, [Friday,November 17 2017]

"ఇటీవ‌లి కాలంలో బంధాలు అనుబంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆ కోవ‌లోనే ఆక‌ట్టుకోబుతున్న మ‌రో ఆస‌క్తిక‌ర‌ చిత్ర‌మిది. తండ్రి -త‌న‌య‌ల అనుబంధం నేప‌థ్యంలో ఉద్వేగ‌భ‌రిత‌మైన కంటెంట్ తో తీస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమా ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. పెద్ద విజ‌యం సాధిస్తుంది'' అన్నారు శ్రీ‌కాంత్ అడ్డాల‌. గాళ్స్‌లో ఎమోష‌న్స్ బేస్ చేసుకుని, తండ్రి - త‌న‌యల‌ బాంధ‌వ్యంపై తెర‌కెక్కిస్తున్న సినిమా 'అమ్మాయిలంతే .. అదో టైపు'. కృష్ణమ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపి వర్మ, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా ప్ర‌ధాన తారాగ‌ణం. గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ ఆవిష్క‌రించిన అనంత‌రం ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ - "ఓ తొంద‌ర‌పాటు నిర్ణ‌యం తండ్రి -కూతుళ్ల మ‌ధ్య దూరం ఎలా పెంచింది? త‌ండ్రి ప్రేమ‌కు దూర‌మైన కూతురు అనుభ‌వించే బాధ, ఆ క్ర‌మంలో సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సీనియర్ నటులు శివాజీ రాజా కీల‌క పాత్ర పోషించారు. ఓ బాధ్యతాయుతమైన తండ్రి గా ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. న‌వ‌త‌రం న‌టీన‌టుల పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. భావోద్వేగాల‌తో సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్ ని ఆక‌ట్టుకుంటుంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.

గోపి వర్మ‌, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా, సాయి, భ‌ద్ర‌మ్‌, వేణుగోపాల్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీనివాస్‌, కూర్పు: గోపి సిందమ్, సాహిత్యంః పూర్ణాచారి, ద‌ర్శ‌కత్వంః కృష్ణ‌మ్.

More News

ఇంద్రసేన ఆడియో విడుదల

విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం "ఇంద్రసేన". ఎన్.కె.ఆర్ ఫిలింస్ , ఆర్,స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరెషన్ పతాకంపై కృష్ణారెడ్డి , రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని

'ఖాకి' హైలైట్స్

కొన్ని సినిమాల మీద అభిమానుల్లో ఎక్స్ పెక్టేషన్స్ చాలానే ఉంటాయి. అంతగా ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచిన అంశాలేంటో ప్రత్యేకంగా చెప్పలేం. కానీ నిదానంగా తరచి చూస్తే ఆకట్టుకునే హైలైట్స్ చాలానే ఉన్నాయనే విషయం అర్థమవుతుంది.

బాల‌య్య కోసం మాస్ బీట్స్‌

'కంచె' సినిమాతో తనలోని ప్ర‌తిభ‌ని చాటిన మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్. న‌ట‌సింహ బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకి కూడా చిరంతన్‌నే సంగీతం అందించాడు. ఆ సినిమాకి చిరంత‌న్ అందించిన బాణీలకు బాలయ్య ఫిదా అయిపోయారు.

త‌మిళ్ సినిమాలో నిహారిక ఫ‌స్ట్‌లుక్

గ‌తేడాది విడుద‌లైన ఒక మ‌నసుతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది మెగా బ్ర‌ద‌ర్  నాగ‌బాబు కుమార్తె కొణిదెల నిహారిక‌. ఆ సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా ప్రిన్సెస్‌.. ప్ర‌స్తుతం యువ క‌థానాయ‌కుడు సుమంత్ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తోంది.

అల‌రించేలా 'హ‌లో' టీజ‌ర్‌

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హలో' మూవీ టీజర్ వచ్చేసింది. "ది లక్కీయ‌స్ట్‌ పీపుల్ బోర్న్ ఆన్ థిస్ ఎర్త్, వాళ్ళు మాత్రం.. ఎవరేం చేసినా ఏం అడ్డొచ్చినా తమ‌ సోల్ మేట్ ని కలుస్తారు, లైఫ్ ని షేర్ చేసుకుంటారు." అంటూ నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ బాగుంది.