శ్రీకాంత్ కొత్త చిత్రం వివరాలు

  • IndiaGlitz, [Thursday,October 05 2017]

మైటీ స్టార్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రంతో అభయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వైద్య రంగం నేపథ్యంలోని అంశాలతో మెడికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. జై రాజా సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రంలో భాగమవడం గురించి కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ....కథ నన్ను బాగా ఆకట్టుకుంది. సబ్జెక్ట్ వినగానే నచ్చి వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. చిత్రంలో నాది ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్. ఇలాంటి మంచి కథలో కీ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. జై రాజా సింగ్ కొత్త దర్శకుడు అయినా భిన్నమైన కథను ప్రతిభావంతంగా రాసుకున్నారు. అన్నారు.

దర్శకుడు జై రాజా సింగ్ మాట్లాడుతూ...ఎప్పుడూ మంచి పాత్రలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని శ్రీకాంత్ గారు ఆరాటపడుతుంటారు. ఆయనలో గొప్ప నటుడు ఉన్నారు. కథ రాసుకుంటున్నప్పుడే ఈ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు చేయాలని అనుకున్నాను. ఆయన మా సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా తెరపై చూపించని విధంగా కొత్త తరహాలో ఆయన పాత్ర ఉంటుంది. మెడికల్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందించబోతున్నాం. మంచి కాస్ట్ అండ్ క్రూ తో త్వరలో సెట్స్ మీదకు చిత్రాన్ని తీసుకెళ్తాం. అన్నారు.

More News

ప్రభాస్ కొత్త సినిమా ఎప్పుడో తెలుసా..

బాహుబలితో నేషనల్ స్టార్ అయిన యంగ్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ ఇప్పుడు `సాహో` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణను జరుపుకుంటుంది.

'మన అక్కినేని' అద్భుతమైన పుస్తకం - వెంకయ్య నాయుడు

‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో ఓ చక్కటి ఫొటో బయోగ్రఫీని ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిషోర్ తీసుకురావడం చాలా సంతోషకరం’’ అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

అప్పుడు ప్రేమ‌మ్‌.. ఇప్పుడు ప్రేత‌మ్‌..

నాగ‌చైత‌న్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ప్రేమ‌మ్ ఒక‌టి. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజయం సాధించిన ప్రేమ‌మ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. గ‌తేడాది అక్టోబ‌ర్ 7న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. చైత‌న్య‌కి న‌టుడిగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇప్పుడు  ఇదే నెల‌లో చైత‌న్య‌కి కాబోయే శ్రీ‌&#

మ‌హిళ‌లు వారి కొడుకుల‌ను స‌రిగా పెంచాలి - రేణుదేశాయ్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న పిల్ల‌ల‌ను చూసుకోవ‌డానికి వ్యక్తి అవ‌స‌రం అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై కొంత‌మంది నెగ‌టివ్‌గా మాట్లాడ‌టం, కామెంట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంద‌రు ఓ అడుగు ముందుకేసి నువ్వు మా వ‌దిన‌వు, నువ్వు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తే, నిన్నుద్వేషిస్తామంటూ రేణుకు ఫేస్‌బుక

విలన్‌గా నటించేందుకు సిద్ధం - ఆదిత్య ఓం

'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో హీరోగా నటించారు ఆదిత్య ఓం. ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.