'రా.రా...' లో మరో గీతం 'గల్లాటే గల్లాటే' విడుదల

  • IndiaGlitz, [Friday,July 14 2017]

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలలోనే విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన రెండవ గీతాన్ని రేడియో సిటీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, గాయని మౌష్మీ నేహా నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. 'గల్లాటే గల్లాటే' పల్లవి గల ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా గాయని మౌష్మీ నేహా ఆలపించారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. ఈ గీతానికి శ్రోతలనుంచి మంచి స్పందన లభించటం ఎంతో ఆనందంగా ఉందని హీరో శ్రీకాంత్ తెలిపారు. సినిమా గురించి శ్రోతలతో మాట్లాడటం ఆనందం కలిగించిందన్నారు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.

మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ రోజు చిత్రం లోని మరో గీతాన్ని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే ఇతర గీతాలను ఒకొక్కటిగా విడుదల చేయటం జరుగుతుంది. చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను త్వరలో విభిన్న రీతిలో హైదరాబాద్ లో జరుపనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఈ నెల లోనే చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్.

More News

ప్రేమిక ను చిన్న మూవీగా చూడకండి...

తనీష్, శృతి యుగళ్ జంటగా నటించిన మూవీ ప్రేమిక. ఈ మూవీని దేశాయ్ ఆర్ట్స్ పతాకంపై దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మాటలు, దర్శకత్వం మహేంద్ర. ఈ సినిమా టీజర్ ను ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.

నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సంబరాలు

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్రతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్

జూలై 16న విజయవాడలో 'నిన్నుకోరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన చిత్రం 'నిన్నుకోరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్తో సూపర్హిట్ చిత్రంగా అందరి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.

'ఫిదా' సెన్సార్ పూర్తి..

'ముకుంద,కంచె వంటి విలక్షణ చిత్రాలతో మెప్పించిన మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మిస్తోన్న చిత్రం 'ఫిదా'.

ఆగస్టు 4న బయపెట్టించే ఇదేం దెయ్యం

శ్రీనాద్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ అర్పి , రచన స్మిత్ , రుచి ప్రధాన పాత్రలో .. ఎ వి రమణ మూర్తి సమర్పణలో వి రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలిమ్స్ పతాకం పై ఎస్. సరిత నిర్మిస్తున్న చిత్రం ''ఇదేం దెయ్యం''.