విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...'

  • IndiaGlitz, [Friday,July 07 2017]

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదల కాబోతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఒక గీతాన్ని రేడియో మిర్చి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాప్ షకీల్, నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా సంగీత దర్శకునితో పాటు గాయని శ్రావణ భార్గవి ఆలపించారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. ఈ గీతానికి శ్రోతలనుంచి మంచి స్పందన లభించటం ఎంతో ఆనందంగా ఉందని హీరో శ్రీకాంత్ తెలిపారు. సినిమా గురించి శ్రోతలతో మాట్లాడటం ఆనందం కలిగించిందన్నారు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ రోజు ఒక గీతాన్ని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే ఇతర గీతాలను ఒకొక్కటిగా విడుదల చేయటం జరుగుతుంది. చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను త్వరలో విభిన్న రీతిలో హైదరాబాద్ లో జరుపనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఈ నెల లోనే చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి నిర్మాత: విజయ్ దర్శకత్వం: విజి చరిష్ యూనిట్

More News

'అనగనగా ఒక ఊళ్ళో' ఫస్ట్ లుక్ లాంచ్!

చంద్ర బాలాజీ ఫిలింస్ పతాకంపై అశోక్ కుమార్,ప్రియావర్మ జంటగా సాయి కృష్ణ కె.వి దర్శకత్వంలో

తమిళనాడులో థియేటర్స్ బంద్ విరమణ...

కేంద్ర ప్రభుత్వం విధించిన సినిమా టికెట్స్ పై 30 శాతం పన్నును రద్దు చేయాలంటూ థియేటర్స్ యజమానులు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో 'సంతోషం' సౌత్ ఇండియన్ 16వ ఫిల్మ్ అవార్డ్సు వేడుక

సంతోషం ఇప్పుడు నవజవ్వనిగా టీనేజిలోకి ప్రవేశించింది.పదిహేనేళ్ల వయసంటే అందంగా అందరినీ అలరించడమే.

నా 75 సంవత్సరాల జన్మదిన సంచికను పుస్తకరూపంలో తేవడం ఆనందంగా వుంది - సూపర్స్టార్ కృష్ణ

తెరపై హీరోలను చూసి వారి సినిమాలను ఆదరించి వారిని అభిమానిస్తారు. కొంతమంది అయితే ఆ హీరోనే ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీగా వుంటారు.

'లై' చిత్రంలోని అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల

యూత్స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్మిటి).