Sreeleela: రవితేజ 'ధమాకా' నుండి శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,June 14 2022]

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

శ్రీలీల పుట్టినరోజు సందర్భంగాసరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ బర్త్ డే పోస్టర్ లో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకుని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో బ్యూటీఫుల్ గా వుంది. ఉబెర్-కూల్ కాస్ట్యూమ్‌లో ప్లజంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రణవి పాత్రలో అలరించనుంది శ్రీలీల.

‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం 'ధమాకా' షూటింగ్ చివరి దశలో ఉంది.

తారాగణం: రవితేజ, శ్రీలీల

More News

యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘‘చోర్ బజార్’’

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.

"ఏనుగు" చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అరుణ్ విజయ్

శ్రీమతి జగన్మోహని సమర్పణలో  విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్,  డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై

Gunaranjan Shetty: అనుష్క సోదరుడి హత్యకు గ్యాంగ్‌స్టర్ స్కెచ్.. భద్రత కోసం ప్రభుత్వానికి వినతి

పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో దేశంలో గ్యాంగ్‌స్టర్‌ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Pawan kalyan: ‘‘ మేజర్ ’’కు పవర్‌స్టార్ అభినందనలు.. ఇండస్ట్రీకి అడివి శేష్ ‌లాంటి వారే కావాలన్న పవన్

26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా తెరకెక్కించిన చిత్రం ‘‘మేజర్’’.

Janasena Party : పార్టీ జనాల్లోకి వెళ్లాలంటే.. క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర : సభ్యత్వ నమోదుపై పవన్ హర్షం

జనసేన పార్టీ నిర్మాణంలో క్రియాశీలక సభ్యుల పాత్ర కీలకమైనదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.