అందుకే సినిమాల‌కు దూర‌మ‌య్యానంటున్న శ్రీముఖి

  • IndiaGlitz, [Friday,April 10 2020]

బుల్లితెర‌, వెండితెర‌కు ఒక‌ప్పుడు దూరం ఎక్కువ‌గా ఉండేది. వెండితెర‌పై డీగ్లామ‌ర్ అయిన వారే బుల్లి తెర‌పై క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపేవారు. బుల్లితెర న‌టీన‌టుల‌కు సినిమాల్లో పెద్ద‌గా అవ‌కాశాలు వ‌చ్చేవి కావు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. మ‌న తెలుగు విష‌యానికి వ‌స్తే అన‌సూయ‌, ర‌ష్మి గౌత‌మ్ వంటి బుల్లితెర వ్యాఖ్యాత‌లు ఇప్పుడు వెండితెర‌పై త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు. అయితే బుల్లితెర‌పై మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీముఖి మాత్రం ‘జులాయి’లో న‌టించినా త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది.

అసలు తానెందుకు సినిమాల్లో నటించడం లేదు అనే విషయంపై శ్రీముఖి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స‌మాధానం చెప్పింది. త‌న తండ్రికి తాను సినిమాల్లో న‌టించ‌డం ఇష్టం లేద‌ని చెప్పిన శ్రీముఖి జులాయిలో న‌టించేట‌ప్పుడు ఇదే ఫ‌స్ట్ అండ్ లాస్ట్ మూవీ అని శ్రీముఖికి ఆమె తండ్రి చెప్పాడ‌ట‌. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ సెల‌క్టివ్‌గా పాత్ర‌ల‌ను ఎంచుకుని సినిమాల్లో న‌టిస్తే బావుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. స‌రే! అనుకుని సినిమాల్లో అవ‌కాశాల‌కు ప్ర‌య‌త్నాలు చేస్తే కొంద‌రు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎక్స్‌పోజింగ్ చేయాల‌ని, లిప్‌లాక్స్ చేయాల‌ని అన్నార‌ట‌. అందుకు శ్రీముఖి స‌సేమిరా! అని చెప్పేసి.. సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. అందుకునే శ్రీముఖి వెండితెర కంటే బుల్లి తెర‌కే ప‌రిమిత‌మైంది.

More News

క‌రోనాపై పోరుకు మ‌హేశ్ కొత్త ఆలోచ‌న‌..!!

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. అన్నీ రంగాలు స్తబ్దుగా అయిపోవడం అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న‌త, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం

నర్సింగ్‌ యాదవ్‌ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ ఏపీలో పరీక్షలు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా... వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని

‘రేపట్నుంచి తెలంగాణలో కరోనా కేసులుండవేమో!’

రేపట్నుంచి అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఉండకపోవచ్చేమోనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

విపత్కర తరుణంలో రాజకీయాలొద్దు..: జనసేనాని

కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయిందని.. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను