close
Choose your channels

'జంబ‌ల‌కిడి పంబ‌' సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

Saturday, June 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`జంబ‌ల‌కిడి పంబ‌` సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

`గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు.

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ `` క‌థ న‌చ్చి చేసిన చిత్ర‌మిది. మా సినిమాకు `జంబ‌ల‌కిడి పంబ‌` టైటిల్ చాలా చ‌క్క‌గా కుదిరింది. టైటిల్ చూసి సినిమాకు వ‌చ్చిన‌ వారికి నిరాశ క‌ల‌గ‌దు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా తెర‌కెక్కించారు`` అని తెలిపారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ `` రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ వ‌చ్చింది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `` ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. అంద‌రినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/ఎ ఇచ్చింది. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి`` అని తెలిపారు.

న‌టీన‌టులు: స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు. సాంకేతిక నిపుణులు: సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.