close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ని పనిమనిషిని చేసేశారుగా... శ్రీరామ్, హమీదా రొమాన్స్

Saturday, September 18, 2021 • తెలుగు Comments

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంట‌ర్‌టైనింగ్‌గా మొద‌లైన‌ప్ప‌టికీ, గ‌త సీజ‌న్ 4 కంటే త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్ న‌మోదు చేసింది. అయితే హౌస్ లో జ‌రుగుతున్న విష‌యాలు మాత్రం ప్రేక్ష‌కులను టీవీల‌కు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ ల‌హ‌రి శారీ, మాన‌స్‌ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది. మాన‌స్‌, ల‌హ‌రి శారి చేతికి మ‌ర్ద‌న చేయ‌డంతో రొమాంటిక్ ట్రాక్ మొద‌లవుతుంది. ఆ త‌రువాత లహ‌రి శారీ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల‌ని మాన‌స్ ను అడుగుతుంది. తెలుగు మ్యాట్రిమొనీ యాడ్‌ హోర్డింగ్‌ వైపు సీన్ మారుతుంది. ప్రెస్టీజ్ కుక్కర్ బుక్ చేసుకోవాలని, ఆపై క‌పుల్స్ వీడియోలు చేస్తూ మోజ్ యాప్‌లో చేరవచ్చ‌ని చెప్తుంది ల‌హ‌రి. ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేందుకు సువ‌ర్ణ‌భూమిలో భాగం కావాల‌ని మాన‌స్ ను ల‌హ‌రి కోరే స‌న్నివేశం ఫ‌న్ గా సాగుతూ అంద‌రినీ న‌వ్విస్తుంది. ఈ రోజు ఎపిసోడ్‌ హైలైట్స్ మీ కోసం.

మానస్‌లో చాలా మార్పొచ్చిందని శ్రీరామ్‌తో ముచ్చట్లు పెట్టాడు విశ్వ. మరోవైపు ఇంటిసభ్యులను ఇమిటేట్‌ చేస్తూ శ్వేతను తెగ నవ్వించాడు జెస్సీ. అతడిలో ఈ టాలెంట్‌ చూసిన శ్వేత.. నీలో చాలా షేడ్స్‌ ఉన్నాయిరా అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అనంతరం రెండోవారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ మొదలైంది. ఇందులో భాగంగా స్క్రీన్‌పై చూపించిన కంటెస్టెంట్లు బజర్‌ మోగగానే బంతిని పట్టుకోవాలి. పట్టుకున్న బంతిపై ఏ ఫుడ్‌ రాసి ఉంటుందో దాన్ని మాత్రమే పంపిస్తాడు బిగ్‌బాస్‌. టాస్క్‌ బిగెన్ అవ్వగానే విశ్వ, లహరి, లోబో, సిరి.. ఎవరూ బాల్‌ పట్టుకోలేకపోయారు. కానీ నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక మాత్రం బాల్‌ క్యాచ్‌ చేసి ఇంట్లో వాళ్లకు ఫుడ్‌ దొరికేలా చేశారు.

శ్రీరామచంద్ర నీమీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటూ కాజల్‌.. హమీదాతో చెప్పింది. సన్నీ కూడా నిన్ను తెగ ఇష్టపడతాడని యానీ మాస్టర్‌ నొక్కి చెప్పింది. అయితే హమీదా మాత్రం తనకు సన్నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమేనని చెప్పింది. తర్వాత బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్‌ పేర్లను ఎంచుకోమన్నాడు. దీంతో విశ్వ, హమీదా.. షణ్ముఖ్‌ను; శ్రీరామచంద్ర, మానస్‌, సన్నీ, యాంకర్‌ రవి, లోబో.. నటరాజ్‌ మాస్టర్‌ను; లహరి, షణ్ముఖ్‌.. మానస్‌ను; ప్రియ, సిరి, నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌.. శ్రీరామచంద్రను; ఉమాదేవి, శ్వేత వర్మ.. జెస్సీని బెస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్‌ మాస్టర్‌ ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికయ్యాడు. ఇక వరస్ట్ పర్ఫామర్ విషయానికి వస్తే.. మెజారిటీ సభ్యులు సన్నీ పేరును సూచించారు. దీంతో ఆయన్ను జైల్లో పెట్టాల్సిందిగా ఆదేశించాడు. అయితే సన్నీకి లహరి, జెస్సీ, రవి అండగా నిలిచారు.

ఆ తర్వాత `బీబీ న్యూస్‌` రిపోర్టర్లుగా యాంకర్‌ రవి, కాజల్‌ని బాధ్యతలిచ్చి వారు ఇంట్లోని ఇతర సభ్యులు ఏమనుకుంటున్నారనే విషయాలను తెలియజేయాలని ఆదేశించారు. దీంతో రవి, కాజల్‌లు అలవోకగా తమ బాధ్యతలను నిర్వర్తించి.. అసలైన ఎంటర్టైన్‌మెంట్‌కి తెరలేపారు. ఇందులో శ్రీరామ్‌, హహీద, సన్నీల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని తెలిపారు అనీ మాస్టర్. ఇతరులు కూడా చాలా వరకు ఇదే విషయం చెప్పారు.

శ్రీరామ్‌ ఇంట్లో అమ్మాయిల గురించి చెబుతూ, శ్వేతను భార్యగా, హమీదాను గర్ల్‌ఫ్రెండ్‌గా, సిరిని పనిమనిషిగా సెలక్ట్‌ చేసుకున్నాడు. మానస్‌ చెబుతూ, వైఫ్‌గా లహరిని, బెస్ట్ ఫ్రెండ్‌గా సిరిని, మరదలుగా ప్రియాంకని, గర్ల్ ఫ్రెండ్‌గా హమీదని, పనిమనిషి కాజల్‌ని అనుకుంటానని చెప్పాడు. సన్నీ చెబుతూ, గర్ల్ ఫ్రెండ్‌గా హహీదని, వైఫ్‌గా శ్వేతని, పనిమనిషిగా సిరిని ఎంచుకున్నాడు

జెస్సీ చెబుతూ, శ్వేతని వైఫ్‌గా, గర్ల్ ఫ్రెండ్‌గా సిరిని, పని మనిషిగా కాజల్‌ని అనుకుంటానని చెప్పాడు. అయితే ఇందులో చివరగా సిరి చెబుతూ శ్రీరామచంద్ర తనకు లవ్‌ ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఆయనతో రిలేషన్‌ పెరుగుతుందని తెలిపింది. అంతేకాదు శ్రీరామ్‌,హమీద కలిసి ఓ లవ్‌ సాంగ్‌కి రొమాంటిక్‌ స్టెప్పులేసి హౌస్‌కి కొత్త టచ్ ఇచ్చారు. ఈ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్‌ చేశారు ఇంటి సభ్యులు. చివర్లో షణ్ముఖ్‌ని అందరూ కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో ఎత్తేయడం ఆకట్టుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz