శ్రీరామ్ హీరోగో వస్తోన్న హర్రర్ చిత్రం 'బేగంపేట'

  • IndiaGlitz, [Wednesday,July 29 2015]

ఆమధ్య తమిళంలో మైనా', సొట్టై' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్ నిచ్చిన సాలోమ్‌ స్టూడియోస్‌ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం బేగంపేట'. శ్రీరామ్‌, లక్ష్మీరాయ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుమన్‌ విలన్‌గా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు వడివుడయాన్‌ తెలిపారు. వడివుడయాన్‌ ఇంతకు ముందు తంబి బెట్టోత్తి సుందరం' అనే విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ భారీ హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వడివుడయాన్‌ వహిస్తున్నారు.

ఈ సందర్భంగా....

చిత్ర దర్శకుడు వడివుడయాన్‌ మాట్లాడుతూ... బేగంపేట ఒక భయంకరమైన హర్రర్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. ఇందులో భారీ యాక్షన్‌ పార్ట్‌ కూడా ఉండడం విశేషం. ఇటీవల ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ పంజాగుట్టలోని శ్మశానవాటికలో ఫైట్‌మాస్టర్‌ కనల్‌ కణ్ణన్‌ సారధ్యంలో హీరో హీరోయిన్లు శ్రీరామ్‌, లక్ష్మీరాయ్‌ 50 ప్రేతాత్మలతో తలపడే దృశ్యాలను వరుసగా పది రోజులు రాత్రిపూట చిత్రీకరించాము. సినిమాలో ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. దీనితోపాటు మరో పది రోజు హైదరాబాద్‌ లోని లొకేషన్లలో మరికొన్ని దృశ్యాలను తీశాము.

హైదరాబాద్‌లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది. కెమెరామెన్‌ శ్రీనివాసరెడ్డిగారు తన కెమెరా పనితనంతో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి జాన్‌పీటర్‌ అందిస్తున్న మ్యూజిక్‌ మరో ఎసెట్‌గా నిలుస్తుంది. హీరోశ్రీరామ్‌కు ఈ చిత్రం ఒక విభిన్నమైన చిత్రం కాగా, ఇటీవల కాంచన, అరణ్మని వంటి సూపర్‌హిట్‌ చిత్రాలో నటించిన అందాల తార లక్ష్మీరాయ్‌ బేగంపేట' చిత్రంలో హీరోయిన్‌గా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇంతవరకు తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న హర్రర్‌ చిత్రాలకు భిన్నమైన రీతిలో తెరకెక్కుతున్న బేగంపేట' మరపురాని థ్రిల్‌ను కగజేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మా చిత్రం బేగంపేట' ఒక బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలుస్తుందని మా గట్టి నమ్మకం' అన్నారు.

More News

31న మళ్లీ మహేష్ పాటలు

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి.

బాలయ్యను చూసిన ఆమె ఆనందం పట్టలేకపోయింది...

అది హైదరాబాద్ లోని గోపాలంపల్లి. అక్కడి మంజీరా అపార్ట్ మెంట్స్ లో నివశిస్తున్న కుటుంబాల్లో ఓ కుటుంబం ఇవాళ (28.07.) పండగ చేసుకుంది.

వెంకీ సినిమా టైటిల్...

విక్టరీ వెంకటేష్, ఏ బేషజాలు లేని స్టార్ హీరో. మల్టీస్టారర్ చిత్రాలకైనా, కామెడి ఎంటర్ టైనర్ మూవీస్ ఏదైనా ఆయనకి నచ్చితే చాలు.

కలాంగారికి ఏకలవ్య శిష్యుణ్ణి - నారా రోహిత్

ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి.

ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి - మంచు మోహన్ బాబు

దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు.