అలా చేయడం తప్పేనంటున్న రాజమౌళి

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా స్థాయి అంత‌ర్జాతీయ స్థాయికి పెరిగింది. ఈ సినిమాలో ప్ర‌తిపాత్ర హైలైట్‌గా నిలిచింది. అందులో ఒక పాత్ర ర‌మ్య‌కృష్ణ న‌టించిన శివ‌గామి. ముందుగా యూనిట్ ఈ పాత్ర కోసం శ్రీదేవిని తీసుకోవాల‌నుకున్నారు. కానీ చివ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ శివ‌గామిగా మెప్పించింది. సినిమా విడుద‌లై పెద్ద హిట్ అయిన త‌ర్వాత రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి భారీ పారితోష‌కంతో పాటు, షేర్‌లో భాగ‌మ‌డిగార‌ని తెలియ‌జేశాడు. కొన్ని రోజుల క్రితం రాజ‌మౌళి చెప్పిన ఈ మాట‌లు సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి.

అయితే మామ్ ప్ర‌మోష‌న్‌లో శ్రీదేవి ఈ విష‌యంపై కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చింది. తాను రాజ‌మౌళిని ఏం అడ‌గ‌లేదంటూ త‌న‌దైన శైళిలో స‌మాధానాలు చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా రాజ‌మౌళి ఓ అంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..శ్రీదేవిగారంటే నాకు అపారమైన గౌర‌వముంది. ఎవ‌రి వాద‌న‌ల‌ను న‌మ్మాలో ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. అయితే అస‌లు విష‌యాన్ని తాను బ‌హిరంగంగా మాట్లాడి ఉండాల్సింది కాద‌ని, ఆ విష‌యంలో తాను చేసింది త‌ప్పేనంటూ చెప్పుకొచ్చాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

More News

సినిమా కంటే రాజమౌళికి అదేక్కువట..

'బాహుబలి' సినిమాతో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి

ధ ధ..ధైర్యానికి జై కొట్టిన కోటి మంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'జై లవకుశ'.

'ఆక్సిజన్ ' రిలీజ్ డేట్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్

రాజమౌళి నెక్ట్స్ సినిమా హీరో...

ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది.ముఖ్యంగా రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏం చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జులై 11న 'లై' టీజర్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్