close
Choose your channels

జక్కన్న కాంపౌండ్‌లో అన్నీ హిట్లే.. హిట్లు మరీ ఈ ఇద్దరి సంగతేంటి!

Sunday, July 14, 2019 • తెలుగు Comments

జక్కన్న కాంపౌండ్‌లో అన్నీ హిట్లే.. హిట్లు మరీ ఈ ఇద్దరి సంగతేంటి!

అవును.. జక్కన్న కాంపౌండ్‌లో అడుగుపెట్టారంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి దాదాపు ఉండదు.. ఇది స్టార్ హీరోలు.. ఈయన సినిమాలతో ఎక్కడికో ఎదిగిపోయిన నటీనటులు చెబుతున్న మాటలివి. అందుకే.. దర్శకధీరుడి సినిమాలో అవకాశం రావాలంటే చాలా కష్టం.. వన్స్ ఒక్కసారి వస్తే మాత్రం వారి రేంజ్‌ ఎక్కడుంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ఇదంతా బహుబలికి ముందు.. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయట.

రాజమౌళి తన కథలు, డైరెక్షన్స్‌తో ఎంతమందిని స్టార్ హీరోలుగా నిలబెట్టారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జక్కన్న తెరకెక్కించిన ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్టే.. ప్లాప్‌లు ఏమైనా ఉన్నాయా చాలా తక్కువ. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘#RRR’.

ఈ సినిమా షూటింగ్‌ను ఏ టైమ్‌లో స్టార్ట్ చేశారో కానీ అన్నీ అశుభాలే.. వరుసగా ఇద్దరు హీరోలు గాయపడటం.. ఫైనల్ అయిన నటీణులు చేజారటం.. మరోవైపు హీరోయిన్లు కొరవడటం.. ఇలా వరుస ఇబ్బందులతో చిత్రబృందం సతమతమవుతోందట. అంటే ఆదిలోనే అడ్డంకులు ఏర్పాడ్డాయన్న మాట. వీటన్నింటినీ అధిగమించి ముందుకెళ్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అనుకూలించట్లేదు. అప్పుడు బాహుబలిలో ప్రభాస్, దగ్గుబాటి రానా ఇద్దరు హీరోల పేర్లు ప్రపంచానికి తెలియవచ్చిన విషయం విదితమే. అయితే ‘#RRR’ లో స్టార్ హీరోల జాబితాలోని చెర్రీ, ఎన్టీర్‌లకు ఈ సినిమాతో బాహుబలికి వచ్చినంత పేరు వస్తుందా..? అనేది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న మెదులుతోందట.

ఇలాంటి పరిస్థితులో తెరకెక్కిన సినిమా ఏ మాత్రం వస్తుందో..? థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో..? మరీ ముఖ్యంగా జూనియర్, చెర్రీలకు ఏ మాత్రం హిట్‌ తెచ్చి క్రేజ్ పెంచుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz