రాజ‌మౌళిని కూడా లైన్‌లో పెట్టిన సంస్థ‌

  • IndiaGlitz, [Sunday,June 10 2018]

'బాహుబ‌లి' స‌క్సెస్‌తో రాజ‌మౌళి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కి ఎదిగారు. ఇప్పుడు ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని ఇటు స్టార్ హీరోలు, అటు ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు క్యూ క‌డుతున్నాయి. ఇప్పుడు రాజ‌మౌళి ఓ మల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. ఈ అక్టోబ‌ర్‌లో సినిమా ప్రారంభం అవుతుంది. ఇది పూర్తై విడుద‌ల కావ‌డానికి క‌నీసం రెండేళ్లు ప‌డుతుందంటున్నారు. ఈ రెండేళ్ల త‌ర్వాత రాజ‌మౌళి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ట‌.

శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, రంగ‌స్థ‌లం వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత మైత్రీ మూవీస్ స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాల‌తో పాటు మ‌హేశ్‌, సుకుమార్ సినిమా కూడా నిర్మించ‌నుంది.