రెండో పాట‌తోనూ అల‌రించిన థ‌మ‌న్‌

  • IndiaGlitz, [Monday,September 11 2017]

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. నాగార్జున రాజుగారి గ‌ది 2, శ‌ర్వానంద్ మ‌హానుభావుడు, విక్ర‌మ్ స్కెచ్‌, అనుష్క భాగ్‌మ‌తి, సాయిధ‌ర‌మ్ తేజ్ జ‌వాన్ చిత్రాలు ఆయ‌న ఖాతాలోనే ఉన్నాయి. వీటిలో ముందుగా మ‌హానుభావుడు చిత్రం తెర‌పైకి రానుంది.

ఈ చిత్రానికి సంబంధించిన సింగిల్స్‌ని వ‌రుస‌గా విడుద‌ల చేస్తోంది ఆ చిత్ర యూనిట్‌. కొద్ది రోజుల క్రితం విడుద‌లైన టైటిల్ ట్రాక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇక ఇవాళే విడుద‌ల చేసిన కిస్ మి బేబి అనే రెండో పాట‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. చూస్తుంటే.. థ‌మ‌న్ ఖాతాలో మ‌రో మ్యూజిక‌ల్ హిట్ ప‌డేట‌ట్టే ఉంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హానుభావుడు ఈ నెల 29న విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల కానుంది.

More News

రీమేక్‌లో నిఖిల్ హీరోయిన్స్‌

గ‌తేడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడా. నిఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హెబ్బా ప‌టేల్‌, నందితా శ్వేత‌, అవికా గోర్ హీరోయిన్స్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' విడుదల వాయిదా!!

పెద్ద చిత్రాలతో పోటీ పడి ప్రచారం నిర్వహిస్తూ..

మూడోసారి కూడా మల్టీస్టార‌రే...

నాగార్జున‌,నాని కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తాడ‌ని కూడా ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపించాయి.అయితే అప్ప‌ట్లో అలాంటిదేమీ లేద‌ని తేల్చేశారు.

మ‌రో రీమేక్‌లో సునీల్‌

హాస్య‌న‌టుడిగా మంచి ఊపు మీదున్న స‌మ‌యంలో అందాల రాముడుతో హీరోగా మారాడు సునీల్‌. త‌మిళ చిత్రానికి రీమేక్ అయిన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది.

ఒకే నెల‌లో రెండు సినిమాల‌తో..

2009లో విడుద‌లైన కిక్ చిత్రం యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. చూస్తుండ‌గానే.. 5 ఏళ్లు తిరిగేస‌రికి ఆగ‌డుతో 50 సినిమాల‌ని పూర్తిచేశాడు.