Telangana BJP:తెలంగాణ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్టార్ హీరో ప్రచారం

  • IndiaGlitz, [Saturday,May 04 2024]

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. ఈసారి 400 సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అన్ని రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ సీనియర్ హీరో, బీజేపీ నేత సురేష్ గోపి రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొన్నారు.

సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ గోపి మాట్లాడుతూ కేంద్రంలో అవసరాన్ని బట్టి ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు కూడా వచ్చేలా చేస్తామన్నారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని.. అయితే తాను మాత్రం ఇద్దరూ గెలిచి కేంద్ర మంత్రులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుచేత కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్‎ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టాని పిలుపునిచ్చారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజార్టీ స్థానాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. మెదక్, జహీరాబాద్, హైదరాబాద్ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. త్వరలోనే మరోసారి ఇద్దరు నేతలు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన కమలం పార్టీ.. ఈసారి అంతకు రెట్టింపు స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. కాగా నాలుగో విడతలో భాగంగా మే 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

More News

Thalaimai Seyalagam:జీ5లో పొలిటిక‌ల్ థ్రిల్లర్ ‘తలమై సెయల్గమ్’ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం జీ5. ప‌లు భాష‌ల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్షకుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది.

Sharmila:సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుతో ఈ వైఎస్సార్ బిడ్డ చేతులు కలిపినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంలో దాడులు, దోపిడీలే: పవన్ కల్యాణ్

రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని.. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు.

CM Jagan:చంద్రబాబు మాటలు నమ్మకండి.. బాలయ్య అడ్డాలో సీఎం జగన్ పిలుపు..

ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో ప్రజల భూములు లొక్కొంటారని..

Sharmila: మీ 'నవరత్నాలు'కు మా 'నవసందేహాలు' ఇవే.. సీఎం జగన్‌కు షర్మిల ప్రశ్నలు

ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు అన్ని పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.