తన కొడుకుకి నామకరణం చేసిన స్టార్ హీరో.. బ్యూటిఫుల్ పిక్ వైరల్

  • IndiaGlitz, [Wednesday,August 04 2021]

నటుడు శివకార్తికేయన్ తమిళ స్టార్ హీరోల్లో ఒకరు. వరుస విజయాలతో శివకార్తికేయన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల శివకార్తికేయన్ ఫ్యామిలిలో పండుగ లాంటి విశేషం చోటు చేసుకుంది.

శివకార్తికేయన్ మరోసారి తండ్రి అయ్యాడు. శివకార్తికేయన్, ఆయన సతీమణి ఆర్తి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. గత నెల జూలై 12నే ఈ విశేషం చోటు చేసుకుంది. తాజాగా శివకార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా తన ముద్దుల కొడుకుని అభిమానులకు పరిచయం చేశాడు.

తన కొడుకుని ముద్దాడుతూ ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ ఆ మారింది. అభిమానులందరి ఆశీస్సులతో తన కొడుక్కి 'గుగన్ దాస్' అని నామకరణం చేసినట్లు శివకార్తికేయన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలు కూడా శివకార్తికేయన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శివకార్తికేయన్, ఆర్తి దంపతులు 2010లో వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. తాజాగా జన్మించిన మగబిడ్డతో శివకార్తికేయన్ ఫ్యామిలీ సంపూర్ణం అయినట్లు అయింది.

ఇదిలా ఉండగా శివకార్తికేయన్ ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తున్నాడు. త్వరలో శివకార్తికేయన్ తెలుగులో డెబ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కు ఈ తమిళ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

More News

కామెడీ ఎంటర్టైనర్ కు చిరు గ్రీన్ సిగ్నల్.. అల్లు అరవింద్ నిర్మాణంలో ?

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల జోరుకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టెలా కనిపించడం లేదు.

లవ్, హర్రర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ సందేశ్ 'ఇందువదన' టీజర్

హీరో వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ఇందువదన.

అదరగొట్టే బీట్ తో 'దిగుదిగుదిగు నాగ' సాంగ్.. ఊరిస్తున్న రీతూ వర్మ

క్రేజీ హీరో నాగశౌర్య, యంగ్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం మంచి విజయం సాధించింది. క్రైమ్, అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఆధ్యంతం ప్రేక్షకులని ఆకట్టుకుంది.

'RRR'కి ముందు రాజమౌళి పరిశీలించిన కాంబినేషన్స్ ఇవే.. అలియా ప్రతి సీన్ లో..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నప్పటి నుంచి ఈ చిత్రం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.