close
Choose your channels

చానెల్‌లో ఆలోచ‌న‌లో స్టార్ హీరో

Thursday, May 16, 2019 • తెలుగు Comments

చానెల్‌లో ఆలోచ‌న‌లో స్టార్ హీరో

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన `సాహో` ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. అలాగే ప్ర‌భాస్ 20వ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది. `బాహుబ‌లి` త‌ర్వాత ఈ హీరో నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. అయితే  ప్ర‌భాస్ సినిమాల్లో క‌థానాయ‌కుడిగానే కాదు.. యు.వి.క్రియేష‌న్స్‌లో సైలెంట్ పార్ట్‌న‌ర్ అనే గుస‌గుస‌లు ఎప్ప‌టి నుండో విన‌ప‌డుతూనే ఉంది.

అయితే తాజాగా ఈయ‌న‌కు సంబంధించిన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. ప్ర‌భాస్ టీవీ చానెల్ పెట్ట‌బోతున్నాడ‌ని. కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌భాస్ చానెల్ స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి దీనిపై ప్ర‌భాస్ కానీ.. అత‌ని స‌న్నిహితులు కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. ఎవ‌రైనా స్పందిస్తారేమో చూడాలి. 

Get Breaking News Alerts From IndiaGlitz