న్యూఇయర్ ను కలిసి సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్....
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్‌కు ఉన్న క్రేజే వేరు. అలాగే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఉన్న అభిమాన గణమే వేరు. రీసెంట్‌గా ధృవ చిత్రంతో మరో సక్సెస్‌ను కూడా రామ్‌చరణ్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వీరు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
రీసెంట్‌గా సూపర్‌స్టార్ మహేష్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి కొత్త సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్, షెడ్యూల్ గ్యాప్‌లో యూరప్ ట్రిప్‌లో ఉన్నాడు. యూరప్‌లోనే మహేష్, నమ్రతలతో పాటు రామ్‌చరణ్, ఉపాసనలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారట.