పాముకాటుకు విద్యార్థి బలి.. జగన్ చేయూత, బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం

విజయనగరం జిల్లా కురుపాంలో గురుకుల హాస్టల్లో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసిన ఘటనలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సీఎం జగన్‌‌కు మంత్రులు పుష్పశ్రీవాణి, వేణుగోపాలకృష్ణలు సమాచారం అందించారు. విద్యార్థి మృతి వార్త తెలిసుకున్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి ఆ పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేయనున్నారు.

కురుపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయంలో గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో విద్యార్థులను పాము కాటువేసింది. విద్యార్ధుల అరుపులు, కేకలతో రంగంలోకి దిగిన సిబ్బంది హుటాహుటిన వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మరణించాడు.

పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులను ఎనిమిదో తరగతి చదువుతోన్న మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌గా అధికారులు గుర్తించారు. వీరిలో రంజిత్ మృతిచెందగా.. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. మరొకరి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

More News

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : కాస్త శాంతించిన పుతిన్.. తాత్కాలికంగా కాల్పుల విరమణ

ఉక్రెయిన్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

క్రికెట్ ప్రపంచానికి షాక్.. ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : భారతీయ విద్యార్ధిపై కాల్పులు , ఆసుపత్రికి తరలింపు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇరుదేశాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ పుతిన్ కానీ, జెలెన్ స్కీ కానీ తగ్గడం లేదు.

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. ఒక ప్రమాదాలకు నో ఛాన్స్ ‘‘క‌వ‌చ్’’ వచ్చేసిందిగా

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైలు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి.

ప్రాజెక్ట్ కే : మీ సాయం కావాలి.. ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.