close
Choose your channels

Aparna Balamurali : అపర్ణా బాలమురళితో విద్యార్ధి అసభ్య ప్రవర్తన.. షేక్ హ్యాండ్, భుజంపై చేయి వేసి.. వీడియో వైరల్

Thursday, January 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు. వారు జనంపై, సమాజంపై వేసే ముద్ర అలాంటిది. అందుకే అంతటి ఫాలోయింగ్. తమ అభిమాన హీరో, హీరోయిన్, క్రీడాకారుడు, నాయకులను జనం బాగా అనుకరిస్తారు. అంతేకాదు.. వారిని దగ్గర నుంచి చూడాలని, కుదిరితే తాకాలని అనుకుంటూ వుంటారు. ఫలానా హీరో, హీరోయిన్లు తమ వీధికి వస్తున్నారంటే చాలు జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అయితే తమ అభిమాన తారలను చూసి ఆనందం పొందే వాళ్లు కొందరైతే, వారిని తాకాలని చూసేవారు ఇంకొందరు. రెండో రకం వాళ్లతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో ఎందరో హీరోయిన్లను పబ్లిక్ ప్లేస్‌లో అనుచిత ప్రవర్తనకు గురైనవారే. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మలయాళ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత అపర్ణా బాలమురళీ.

విద్యార్ధి తీరుతో అపర్ణ షాక్:

అపర్ణ తాజా చిత్రం ‘తన్కమ్’. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. దీనిలో భాగంగా తన కో స్టార్ వినీత్ శ్రీనివాసన్‌తో కలిసి ఆమె కేరళలోని ఓ లా కాలేజీ‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అపర్ణ వేదికపై కూర్చొని వుండగా.. ఓ విద్యార్ధి స్టేజ్‌పైకి చేరుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఆమెను బలవంతంగా నిల్చోబెట్టి.. భుజంపై చేయి వేయబోయాడు. ఊహించని ఈ సంఘటనతో షాక్‌కు గురైన అపర్ణ .. అతనికి దూరంగా జరగడంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాసేపటికీ సదరు విద్యార్ధి స్టేజ్ మీదకు వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అపర్ణ చేతిలో అరడజను సినిమాలు :

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అపర్ణ చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. ఇవన్నీ మలయాళ చిత్రాలు కావడం విశేషం. ధూమమ్, ఉలా, పద్మిని, మిండియమ్ పరంజమ్, 2018, తన్కమ్ చిత్రాల్లో అపర్ణా బాల మురళీ నటిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో వున్నాయి. కాగా.. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన సూరరైపోట్రులో (తెలుగులో ఆకాశం నీ హద్దు రా) నటనకు గాను అపర్ణ బాలమురళికి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఘన విజయంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.