స్టైలీష్ ఫిల్మ్ స‌రైనోడు - అల్లు అర‌వింద్

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ...స‌రైనోడు మాస్ ఫిల్మ్ అంటూ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ..ఇటీవ‌ల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాని స్టైలీష్ ఫిల్మ్ ఇది. హిందీ సినిమాలు చూసి అలాంటి సినిమాలు మన వాళ్లు ఎందుకు తీయ‌లేరు అనుకునే వాళ్ల‌కు స‌రైనోడు ఓ స‌మాధానం. బ‌న్ని స్టైల్ ఉంటూనే బోయ‌పాటి మార్క్ తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి రిషి పంజాబి కెమెరామెన్ గా వ‌ర్క్ చేసారు. ఆయ‌న 500 యాడ్ ఫిల్మ్స్ కి వ‌ర్క్ చేసారు. ఆయ‌న వ‌ర్క్ చూసి బ‌న్ని కావాల‌ని ఆయ‌న‌తో ఈ సినిమా కి వ‌ర్క్ చేయించారు. సినిమా స్టైలీష్ గా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంద‌ని డిష్క‌స్ చేసి ఆత‌ర్వాత షూటింగ్ చేసాం. మేము ఎంత క‌ష్ట‌ప‌డ్డాం అనేది సినిమా చూసాకా అంద‌రికీ తెలుస్తుంది అన్నారు.

కెమెరామెన్ రిషి పంజాబి మాట్లాడుతూ...ఈ సినిమా కోసం ఎనిమిది నెల‌లు వ‌ర్క్ చేసాను. త‌మ‌న్ మంచి ట్యూన్స్ అందించాడు. త‌మ‌న్ అందించిన సాంగ్స్, బోయ‌పాటి శ్రీను యాక్ష‌న్స్ సీన్స్ చిత్రీక‌రించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మాట్లాడుతూ...క‌మ‌ర్షియ‌ల్ మూవీకి ఆరు పాట‌లు అంద‌రికీ న‌చ్చేలా అందించ‌డం అంటే చాలా క‌ష్టం. ఈ సాంగ్స్ కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసాను. స్టైలీష్ ఫ్యామిలీ డ్రామా ఇది. సినిమా బాగా రావాల‌ని బోయ‌పాటి చాలా హార్డ్ వ‌ర్క్ చేసారు. కెమెరామెన్ రిషి మా సాంగ్స్ చిత్రీక‌రించ‌డం త‌న అదృష్టం అంటున్నాడు కానీ ఆయ‌న‌తో వ‌ర్క్ చేసినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. గ‌తంలో ఏప్రిల్ 11న రేసుగుర్రం రిలీజైంది. 11 కి డ‌బుల్ 22న వ‌స్తున్న స‌రైనోడు రేసుగుర్రం క‌న్నా పెద్ద విజ‌యం సాధించాలి అన్నారు.

ఆది మాట్లాడుతూ..బ‌న్ని సినిమా అంటే ఇక్క‌డ ఊర మాస్ ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ త‌మిళ‌నాడులో కూడా ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అని భ‌యం ఉంటుంది. కానీ ఈ సినిమా రిజ‌ల్ట్ గురించి ఎలాంటి భ‌యం లేదు. బ‌న్ని, బోయ‌పాటి, అల్లు అర‌వింద్ ఈ ముగ్గురు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. నేను హీరోగా న‌టిస్తూ ఈ సినిమాలో ఎందుకు విల‌న్ గా న‌టించాను అని అంద‌రూ అడుగుతున్నారు. దీనికి స‌మాధానం స‌రైనోడు రిలీజ్ త‌ర్వాత అంద‌రికీ తెలుస్తుంది అన్నారు.

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...బోయ‌పాటి గారి సినిమా అంటే యాక్ష‌న్ ఉంటుంది అనుకుంటారు. ఇందులో యాక్ష‌న్ తో పాటు మంచి ఎమోష‌న్ ఉంది. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు అంద‌రూ చూడ‌ద‌గ్గ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఆది ఇందులో హాలీవుడ్ స్టైల్ లో ఉండే విల‌న్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో విల‌న్ క్యారెక్ట‌ర్ ఇచ్చినా నేను చేస్తాను. అంత‌లా ఆ క్యారెక్ట‌ర్ ఉంటుంది అన్నారు.

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ....నాకు మైక్ టైస‌న్ ని ఇస్తే బాక్సింగ్ సినిమా తీస్తాను. మైకేల్ జాక్స‌న్ ని ఇస్తే డ్యాన్స్ సినిమా తీస్తాను. నా హీరో ఎవ‌రు అనేది మైండ్ లో పెట్టుకుని అత‌నితో ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందో అలాంటి సినిమానే తీస్తాను. స‌రైనోడు ఒక మంచి అనుభూతి క‌లిగిస్తుంది. మంచి టీమ్ తో వ‌ర్క్ చేసినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అన్నారు.

More News

మరోసారి నోరు జారిన బాలయ్య....

నందమూరి నటసింహం బాలయ్య సావిత్రి ఆడియో ఫంక్షన్లో అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి..కడుపు అయినా చేయాలి...అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.

మెగా హీరోయిన్ ఆడియో డిలే అవుతుంది....

‘ఊహలు గుసగుసలాడే’సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగశౌర్యకు ఈ మధ్య అన్నీ సినిమాలు సక్సెస్ ను తీసుకురాలేకపోతున్నాయి.

కల్యాణ్ రామ్ తో మిస్ ఇండియా...

హీరో,నిర్మాత కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని తన స్వంత బ్యానర్ ఎన్టీఆర్ఆర్ట్స్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడనే సంగతి తెలిసిందే.

'24' సీక్వెల్ , బాలీవుడ్ హీరోల ఆసక్తి....

'13బి','ఇష్క్ ' చిత్రాలు తర్వాత మనం సూపర్ సక్సెస్ తో సౌతిండియన్ డైరెక్టర్స్ లో బెస్ట్ అనిపించుకున్న విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు సూర్య హీరోగా,నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 సినిమాను నిర్మించారు.

మరోసారి నారా హీరో గెస్ట్ అప్పియరెన్స్....

కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన చిత్రాలను చేస్తూ వస్తోన్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం రాజా చెయ్యవేస్తే విడుదల కోసం వెయిట్ చేస్తూనే, తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.