close
Choose your channels

సమంతతో నా రిలేషన్ చైతూకు తెలుసు.. ఆయన ఒక్క స్టేట్‌మెంట్‌ ఇస్తే చాలు..: ప్రీతమ్‌ జుకల్కర్‌

Tuesday, October 12, 2021 • తెలుగు Comments

టాలీవుడ్ స్టార్ కపుల్‌ అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా వస్తున్న పుకార్లును నిజం చేస్తూ తాము విడిపోతున్నామంటూ అక్టోబర్‌ 2న ఈ స్టార్‌ కపుల్ అధికారికంగా విడాకుల సంగతిని ప్రకటించారు. అయితే ఎంతో అన్యోన్యంగా వుండే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు అంతుబట్టక సినీ జనాలతో పాటు సామాన్యులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో వీరి విడాకులపై రకరకాల కథనాలు వచ్చాయి. వీటిపై ఎంతో ఓపిక పట్టిన సమంత సైతం వ్యవహారం శృతిమించడంతో పుకారు రాయుళ్లుకు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కామెంట్లకు మాత్రం తెరపడటం లేదు.

ముఖ్యంగా చై-సామ్‌ విడిపోవడానికి సమంత పర్సనల్ స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కరేనంటూ ప్రచారం జరిగింది. అతని వల్లే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్‌ చాలా క్లోజ్‌గా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ హాట్ కామెంట్‌ చేశారు. దీంతో ప్రీతమ్‌ను నెటిజన్లు, అక్కినేని అభిమానులు టార్గెట్ చేశారు. అయితే నెగిటివ్‌ కామెంట్స్‌‌పై సమంత స్ట్రాంగ్ కౌంటరిచ్చినా వాటికి తెరపడకపోవడంతో ... తాజాగా ప్రీతమ్‌ జుకల్కర్‌ రంగంలోకి దిగాడు. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపైనా, సమంతపై వస్తున్న రుమర్లపై పెదవి విప్పాడు.

తాను సమంతను 'జిజి' అని పిలుస్తానన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసునని.. జిజి అంటే సోదరి అని అర్థమని చెప్పాడు. అలాంటిది తమ ఇద్దరికీ ఎఫైర్ అంటగడుతున్నారని.. ఐ లవ్యూ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని కొందరు ప్రశ్నిస్తున్నారని ప్రీతమ్ చెప్పాడు. ఫ్యామిలీ మెంబర్స్‌కి, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పా... సమంత విడాకుల ఎపిసోడ్ తర్వాత తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాగచైతన్యకు అంతా తెలుసునని... ప్రస్తుతం తమ ఇద్దరిపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోందని ప్రీతమ్ వాపోయాడు. ఆయన ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే పరిస్థితి మారుతుందని.. కొందరిని అదుపులో పెట్టేందుకు చైతూ కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని ప్రీతమ్ స్పష్టం చేశాడు. జీజీ ప్రస్తుతం చాలా బాధలో వున్నారని.. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో ఆమెకు వుంటాని.. ఇలాంటి ట్రోలింగ్‌కు తాను భయపడేది లేదని ప్రీతమ్ తేల్చిచెప్పాడు. మరి అతని కామెంట్స్‌తో నెటిజన్లు చల్లబడతారా ... వీరిని కంట్రోల్ చేయడానికి ప్రీతమ్ చెప్పినట్లుగా చైతూ ఏమైనా చేస్తారా అంటూ ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz