డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌కు సిద్ద‌మైన సుబ్ర‌మ‌ణ్య‌పురం

  • IndiaGlitz, [Saturday,November 24 2018]

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌ముడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్య‌పురం. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికెట్ తో డిసెంబర్ 7న అత్య‌ధిక థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సైన్స్ కి అంద‌ని ఎన్నో ర‌హాస్యాలు మాన‌వ మేథ‌స్సుకు స‌వాళ్ళు విసురుతూనే ఉంటాయి. భ‌గ‌వంతుని మీద న‌మ్మ‌కం కూడా అలాంటిదే, ఆ న‌మ్మ‌కాన్ని ప్ర‌శ్నించే కార్తిక్ ప‌రిశోధ‌న‌లు ఎలాంటి నిజాల‌ను వెలుగులోకి తెచ్చాయి..? కాపాడ‌వ‌ల్సిన భ‌గ‌వంతుడి ఆగ్ర‌హం త‌ట్టుకోవ‌డం సాధ్యం అవుతుందా అనే ప్ర‌శ్న‌లు కు స‌మాధానం ఈ నెల 7న దొర‌క‌బోతుంది.

విడుద‌లైన ట్రైల‌ర్ కి మంచి స్పంద‌న ల‌భించింది. ఒక‌రోజులో 1మిలియ‌న్ వ్యూస్ ని సాధించిన సుబ్ర‌మ‌ణ్య‌పురం ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ చిత్రయూనిట్ కి అభినంద‌న‌లు తెలిపింది. థ్రిల్ల‌ర్స్ లో సుబ్ర‌మ‌ణ్య‌పురంప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంటుద‌ని అంటుంది చిత్ర యూనిట్. విజువల్ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే 'సుబ్రమణ్యపురం' ఇండస్ట్రీ లోఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది.

ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్మార్కెట్ బిజినెస్లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకువిజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం 'సుబ్రమణ్యపురం' కు వర్క్ చేసారు. బాలసుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 7న బ్ర‌హ్మండ‌మైన విడుద‌ల‌కుసిద్దం అవుత‌న్న సుబ్ర‌మ‌ణ్య‌పురం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతుల‌ను అందిస్తుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్త ప‌రిచింది చిత్ర యూనిట్.

More News

'టాక్సీవాల' సక్సెస్ కి తెలుగు ప్రేక్షకుల ధన్యవాదాలు - నిర్మాత ఎస్‌కెఎన్

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో

పెళ్లి చేసుకున్న విల‌న్‌...

తెలుగు, త‌మిళ భాష‌ల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు హ‌రీష్ ఉత్త‌మ‌న్‌.

ర‌జ‌నీ ఆరోగ్యంపై వదంతులు

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0' ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

డైరెక్ట‌ర్‌కి కోటిన్న‌ర ఫైన్‌

సాధార‌ణంగా ఓ సక్సెస్ వ‌స్తే ఇండ‌స్ట్రీలో వ‌చ్చే పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని చాలా మంది గౌర‌విస్తుంటారు.

'సర్వం తాలమయం' సినిమా టీజర్, ఫస్ట్ లుక్ విడుదల

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'సర్వం తాలమయం' సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ పోస్టర్ లో జీవీ ప్రకాష్ బ్రాహ్మణ గెటప్ లో