close
Choose your channels

తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ

Thursday, July 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ

తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని.. మళ్లీ తన ఆరోగ్యం క్షీణించిందని వార్తల్లో వచ్చినట్టు తెలిసిందని.. తాను ఆరోగ్యంగా ఉన్నానని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. ఇటీవలే తనకు లివర్ ప్లాంటేషన్ జరిగిందని అనంతరం కోలుకున్నానని ఆయన తెలిపారు. కాకపోతే కరోనా కారణంగా ప్రజలందరి లాగే తాను కూడా జాగ్రత్తగా ఉంటున్నానని.. అందుకే బయటకు రావడం లేదు తప్ప తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని అశోక్ తేజ స్పష్టం చేశారు.

‘‘మీ అందరి ప్రేమ వల్ల, ప్రభుత్వ సహకారంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే పాటలు రాయడం కూడా మొదలు పెట్టాను. నేను చాలా ఆరోగ్యంగా.. సంతోషంగా కూడా ఉన్నాను. కాకపోతే కరోనా కారణంగా జాగ్రత్తగా ఉంటున్నాను తప్ప నా ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. వార్తల్లో అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమించిందని వచ్చినట్టు తెలిసింది. అదేమీ లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నా’’ అని సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.