close
Choose your channels

సుదీప్ పాత్ర పేరెంటంటే..?

Saturday, September 1, 2018 • తెలుగు Comments

సుదీప్ పాత్ర పేరెంటంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో చిత్రం 'సైరా నరసింహారెడ్డి`.

ఈ సినిమాలో కిచ్చా సుదీప్ అవుకు రాజు అనే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రేపు కిచ్చా సుదీప్ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా అవుకురాజుగా సుదీప్ లుక్‌ను నేడు సైరా యూనిట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి లుక్ మాత్ర‌మే ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది. త‌ర్వాత సుదీప్ లుక్ మాత్ర‌మే విడుద‌ల కానుంది.